Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నల్లగొండ కాంగ్రెస్ లో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక చిచ్చు …కోమటిరెడ్డి పై అభ్యర్థి ఫైర్

నల్లగొండ కాంగ్రెస్ లో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక చిచ్చు …కోమటిరెడ్డి పై అభ్యర్థి ఫైర్
-కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎస్సీ, ఎస్టీలు బుద్ధి చెపుతారు
-ఎమ్మెల్సీగా పోటీ చేసిన కాంగ్రెస్ జెడ్పీటీసీ నగేశ్
-కోమటిరెడ్డి తనకు ఓట్లు వేయొద్దని ఓటర్లకు చెప్పారని మండిపాటు
-టీఆర్ఎస్ కు కోమటిరెడ్డి అమ్ముడుపోయారని ఆరోపణ

నల్లగొండ స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్ జడ్పీటీసీ నగేష్ ఫైర్ అయ్యారు. కోమటి రెడ్డి తనకు ఓట్లు వేయవద్దని చెప్పారని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు ఎస్సీలు ,ఎస్టీలు బుద్ది చెబుతారని ధ్వజమెత్తారు . తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడినైనప్పటికీ వేరే అభ్యర్థికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ఇచ్చారని ఆయన మద్దతు ఇచ్చిన అభ్యర్థికి కేవలం 26 ఓట్లు మాత్రమే వచ్చాయని విమర్శించారు. అధికారపార్టీకి కోమటిరెడ్డి అమ్మడు పోయారని ఆరోపించారు. కోమటి రెడ్డి ఆయన అనుచరులకు కోటి రూపాయలు అందాయని అందువల్లనే వారు తనకు ఓట్లు వేయలేదని విమర్శలు గుప్పించారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తనకు సహకరించలేదని నగేష్ అన్నారు. ఈసారి తన సత్తా ఏమిటో చూపిస్తానని అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నగేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదని… మొత్తం ఆరుగురు ఇండిపెండెంట్లం బరిలో నిలిచామని… తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీనని… అయినప్పటికీ తనకు ఓటు వేయొద్దని కోమటిరెడ్డి ఓటర్లకు చెప్పారని మండిపడ్డారు. కోమటిరెడ్డి నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థికి కేవలం 26 ఓట్లు మాత్రమే వచ్చాయని, తనకు 226 ఓట్లు వచ్చాయని చెప్పారు. కోమటిరెడ్డి వల్లే తనకు అన్యాయం జరిగిందని అన్నారు.

కోమటిరెడ్డికి, ఆయన అనుచరులకు టీఆర్ఎస్ పార్టీ ద్వారా కోటి రూపాయలు అందాయని నగేశ్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు కోమటిరెడ్డి అమ్ముడుపోయారని విమర్శించారు. కోమటిరెడ్డికి ఎస్సీ, ఎస్టీలు బుద్ధి చెపుతారని అన్నారు. మరోవైపు అన్ని ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Related posts

ప్రధాని మోడీ పర్యటన నిరసించండి …కూనంనేని

Drukpadam

కేసీఆర్ తర్వాత నేనే.. ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు!

Drukpadam

రాష్ట్రానికి కేటీఆర్ సీఎం …దేశానికి ప్రధాని కేసీఆర్ …శాసనసభలో మంత్రి మల్లారెడ్డి …

Drukpadam

Leave a Comment