Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కలచివేస్తున్న ఫొటోలు : కెన్యాలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు.. నీళ్లు, తిండి లేక జిరాఫీల మృత్యుఘోష!

కలచివేస్తున్న ఫొటోలు : కెన్యాలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు.. నీళ్లు, తిండి లేక జిరాఫీల మృత్యుఘోష!

  • 4 వేల జిరాఫీలకు ప్రమాదం ఉందన్న ఆందోళన
  • సెప్టెంబర్ నుంచి ఉత్తర కెన్యాలో సాధారణం కన్నా 30% తక్కువ వానలు
  • జాతీయ విపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం

కెన్యాలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. వర్షాలు రాక.. నీళ్లు లేక.. తిండి దొరక్క మూగజీవాలు మృత్యువుతో ఘోషిస్తున్నాయి. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆరు జిరాఫీలు తిండి తిప్పలు లేకుండా ఒకే చోట పడి చనిపోయిన హృదయ విదారక చిత్రాలు అందరినీ కదిలించి వేస్తున్నాయి. ఈ విషాద ఘటన వాజిర్ లోని సాబూలీ వైల్డ్ లైఫ్ కన్జర్వెన్సీలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలను అక్కడి సిబ్బంది చెప్పారు.

నీళ్ల కోసం వెతుక్కుంటూ వెళ్లిన జిరాఫీలు కన్జర్వెన్సీలోని ఓ రిజర్వాయర్ లోకి వెళ్లాయని, అందులోని ఓ బరుద మడుగులో కూరుకుపోయి బయటకు రాలేకపోయాయని చెప్పారు. దీంతో తిండి, నీళ్లు లేక అలమటించి అవి ప్రాణాలు వదిలాయని అన్నారు. ఆరు జిరాఫీలూ ఒకే చోట చనిపోయిన ఆ ఫొటో నెట్ లో సంచలనం సృష్టించింది.


సెప్టెంబర్ నుంచి కెన్యా ఉత్తరప్రాంతంలో సాధారణ వర్షపాతం కన్నా 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం, నీళ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇటు పాడి పశువులకు గ్రాసం కూడా దొరకడం లేదు. వన్యప్రాణుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పెంపుడు జంతువుల కన్నా వన్యప్రాణులకే ముప్పు ఎక్కువగా ఉందని బౌర్ ఆల్జీ జిరాఫీ శాంక్చువరీ ఉద్యోగి ఇబ్రహీం అలీ అన్నారు.

పెంపుడు జంతువులకు అంతో ఇంతో ఇంట్లో వాళ్లైనా గ్రాసం, నీళ్లు ఇస్తారని, కానీ, వన్యప్రాణుల సంరక్షణను చూసేవారు ఎవరుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. నదీ తీరాల్లో పంట పొలాల వల్ల జిరాఫీలకు నీరు దొరక్కుండా పోతోందని చెప్పారు. కాగా, ఈ కరవుతో గరిస్సా కౌంటీలోని 4 వేల జిరాఫీలకు ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఓ నివేదిక కూడా విడుదలైంది. ఇటు ఈ కరవును జాతీయ విపత్తుగా ప్రకటించారు కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా. అందులో భాగంగా కరవు ప్రభావం పడిన 25 లక్షల మందికి ఎమర్జెన్సీ రిలీఫ్ క్యాష్ ట్రాన్స్ ఫర్ ప్రోగ్రామ్ ను ప్రభుత్వం ప్రకటించింది.

Related posts

సరదాగా సైకిల్ తొక్కుతూ కిందపడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. 

Drukpadam

యూనిఫాంపై బీజేపీ కండువా వేసుకున్న పోలీసు అధికారి.. విచారణకు ఆదేశం!

Drukpadam

మల్లారెడ్డి కుమారుడికి ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు!

Drukpadam

Leave a Comment