Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మూడు రాజధానులు …అమరావతి రాజధాని ర్యాలీలతో హీటెక్కిన తిరుపతి!

మూడు రాజధానులు …అమరావతి రాజధాని ర్యాలీలతో హీటెక్కిన తిరుపతి!
-మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ
-తిరుపతి లో పోటా పోటీ ప్రదర్శనలు
-రేపు తిరుపతిలో రైతుల సభ
-నేడు ఆసక్తికర పరిణామం
-రాయలసీమ మేధావుల ఫోరం భారీ ర్యాలీ
-వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
-వికేంద్రీకరణతోనే అభివృద్ధి అంటూ నినాదాలు
-అమరావతి రాజధాని పేరుతొ రేపు తిరుపతిలో సభ

ఏపీ లో ఒకే రాజధాని అమరావతి ఉండాలని రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర 45 రోజులపాటు సాగి అలిపిరి వద్ద మొన్న ముగిసింది. అనంతరం రైతులు అలిపిరి నడకదారి గుండా వెళ్లి ఏడూ కొండల స్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలో బహిరంగసభకు న్యాయస్థానం అనుమతి తీసుకున్నారు. అక్కడ రేపు బహిరంగ సభ జరగనున్నది . మూడు రాజధానులు మద్దతుగా గురువారం తిరుపతిలో సభ జరిగింది. రెండు సభలకు జరుగుతున్నా ఏర్పాట్లు హడావుడి తో తిరుపతి వేడెక్కింది. రాయలసీమ మేధావుల ఫోరమ్ ఆధ్వర్యంలో మూడు రాజధనలుకు అనుకూలంగా సభ జరగ్గా ఒకే రాజధాని అది అమరావతి లోనే ఉండాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ 45 రోజుల పాటు అమరావతి నుంచి తిరుపతి కి పాదయాత్ర నిర్వహించారు.

ప్రభుత్వం ప్రధానంగా వైయస్సార్ సీపీ మూడు రాజధానులు అనుకూలంగా ఉండగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తో పాటు బీజేపీ , జనసేన లాంటి పార్టీలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అమరావతి రాజధాని వ్యవహారం న్యాయస్థానం మెట్లు వెక్కింది. తమకు రాజధాని ఇక్కడనే ఉంటుందనే హామీతోనే తమభూములు ఇచ్చామని రైతులు అంటున్నారు. రైతులపేరుతో అమరావతిలో వ్యాపారం జరిగిందని అందువల్ల దానిపై విచారణ జరిగి చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం అంటుంది. వైకాపా ప్రభుత్వం అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా , ఎక్సక్యూటివ్ రాజధానిగా విశాఖను , న్యాయరాజధానిగా కర్నూలు ను పెట్టాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా శాసనసభలో తీర్మానం కూడా చేసిందని. కొందరు కోర్టుకు వెళ్లడంతో విషయం కోర్టులో ఉన్నందున తిరిగి శాసనసభలో దాన్ని ఉపసంహరించుకుంటూ తీర్మానం చేశారు. అయితే గతంలో బిల్లులను సరిచేసి మరింత సమగ్రంగా బిల్లు తీసుకొస్తామని సీఎం జగన్ సభలోని ప్రకటించారు.

ఏపీకి ఒకటే రాజధాని అంటూ ఓవైపు అమరావతి రైతులు రేపు తిరుపతిలో సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మూడు రాజధానులకు మద్దతుగా నేడు తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం చేపట్టిన ఈ ర్యాలీకి వేలాదిమంది తరలివచ్చారు. బాలాజీ కాలనీ నుంచి తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో యువతీయువకులు అత్యధికంగా పాల్గొన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమంటూ నినాదాలు చేశారు.

Related posts

కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హతలేదు: ఉత్తమ్ కుమార్…

Drukpadam

కడుపు మంటతోనే విమర్శలు -తప్పుడు ప్రచారాలు :సజ్జల

Drukpadam

‘కాట్సా’ చట్టం నుంచి భారత్ కు మినహాయింపులు ఇవ్వలేం: అమెరికా!

Drukpadam

Leave a Comment