60 సంవత్సరాలు పైబడ్డ ఎంపీలకు కరోనా వ్యాక్సిన్
– మొత్తం 777 మంది ఎంపీలలో 366 ఈ కోవలోకే
-వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని ,ఉపరాష్ట్రపతి
మన దేశంలోని అత్యున్నతి వేదికైన పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి మొత్తం 777 మంది ఎంపీ లు ఉండగా వారిలో 366 మంది ఎంపీలు 60 సంవత్సరాల పైబడ్డ వారు ఉన్నారు.వారికీ రెండా దశలో భాగంగా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వైద్యశాఖ సిద్ధమైంది. ఈ మేరకు లోకసభ సెక్రటేరేయట్ తెలిపింది. 60 సంవత్సరాల పైన వారికీ ముందుగా వ్యాక్సిన్ చేసేందుకు లెక్కలు తీశారు.మొత్తం సభ్యులలో అంటే రాజ్యసభ , లోకసభ కలిపి 777 మంది ఎంపీలు ఉన్నారు వారిలో 366 మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. అంటే కాకుండా గతంలో కోరిన భారీన పడినవారికి కూడా ప్రాధాన్యత గా గుర్తించి వ్యాక్సిన్ వేసేందుకు వేర్పాట్లు చేశారు. మార్చ్ 1 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చ్ 8 వరకు కొనసాగుతుంది. కరోనా కారణంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అత్యంత జాగ్రత్తలు తీసుకుని నిర్వయించారు. శీతాకాలం జరగలిసిన సమావేశాలు దాదాపు బడ్జెట్ తో కలిపి నిర్వయించారు. ఢిల్లీ లో కరోనా దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉండటంతో పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజులను తగ్గించారు. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోకసభ సమావేశాలు వేర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించటం, సభ్యులు మాట్లాడేందుకు ఎంక్లోజర్స్ వేర్పాటు చేయటం లాంటి చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం యావత్తు ఒక్క తాటిపై నడిచింది. వ్యాక్సిన్ వచ్చిన తరువాత ఇప్పుడిప్పుడే దేశవ్యాపితంగా చర్యలు చేపట్టారు.
previous post