వికారాబాద్ లో పరిసరాల్లో బైక్ పై పవన్ కళ్యాణ్!
-ఆయన్ను చూసేందుకు ఎగబడిన జనం
-పవర్ స్టార్ ,పవర్ స్టార్ అంటూ నినాదాలు
-భీమ్లానాయక్ లో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్.ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ను వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉండడంతో షూటింగ్ స్పాట్ లో అడుగు పెట్టారు. భీమ్లానాయక్ లో పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ బైక్ ని నడుపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ వద్దకు భారీగా స్థానికులు చేరుకున్నారు. స్తానికులు పవన్ కళ్యాణ్ ను చూడడానికి భారీగా లొకేషన్ కు వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నినాదాలతో అక్కడ హోరెత్తించారు. దీంతో పవన్ కారు నుంచి కారులో నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కు అభివాదం చేశారు.
భీమ్లానాయక్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నదని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ సహా రిలీజైన అన్ని పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తమిళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు ఇగోలున్న వ్యక్తుల మధ్య చోటు చేసుకునే సంఘటనలు ఆధ్యాంతం ఆకట్టుకుంటాయి. పవన్‌కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా రానా డానియల్ రౌడీ పాత్రలో నటిస్తున్నారు. నిత్యామేనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.