Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదు: నారా భువనేశ్వరి!

ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదు: నారా భువనేశ్వరి!
తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్టు కార్యక్రమం
హాజరైన నారా భువనేశ్వరి
వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థికసాయం
ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకోబోనని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి నేడు తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏ మహిళను అవమానించినా అది సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. తప్పిదాలకు పాల్పడి పాపాత్ములు అనిపించుకోవద్దని, ఎల్లవేళలా ఇతరుల పట్ల సానుభూతి, దయతో వ్యవహరించి సాయపడదామని పేర్కొన్నారు.

ఇటీవల పరిణామాల నేపథ్యంలో స్పందిస్తూ, ఇతరుల వ్యాఖ్యలను తాను పట్టించుకోబోనని భువనేశ్వరి స్పష్టం చేశారు. వీటిని పట్టించుకుంటూ పోతే సమయం వృథా అన్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా నష్టపోయిన 48 మందికి సాయం అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. సాయం అందుకున్నవారిలో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందినవారున్నారు.

ఆమె పట్ల కొందరు ఎమ్మెల్యేలు అనుచితంగా మాట్లాడిన విషయాన్నీ మీడియా ఆమె దృష్టికి తీసుకురాగా వాటిగురించి పట్టించుకోని టైం వేస్ట్ చేసుకోవద్దని అన్నారు . చంద్రబాబు ఈ విషయంపై భాదపడిని విషయాన్నీ గుర్తు చేయగా ఆయన బాధపడ్డారు ,నేను కూడా బాధపడ్డాను .ఈ సందర్భంగా కుటంబసభ్యులందరు తనకు మద్దతుగా మాట్లాడటం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. హెరిటేజ్ గురించి ఆమె మాట్లాడుతూ అనేక సార్లు మా వ్యాపారాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని అయనప్పటికీ అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని వ్యాపారమంతా పారదర్శికంగానే జరుగుతుందని అందువల్ల హెరిటేజ్ ని ఎవరు టచ్ చేయలేరని అన్నారు.

Related posts

అంబేద్కర్ విశ్వమానవుడు … ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయం …సీఎం కేసీఆర్

Drukpadam

రఘురామ గాయాలు కస్టడీలోనే అయ్యాయని సైనిక ఆసుపత్రి చెప్పలేదు: ఏపీ సీఐడీ!

Drukpadam

బీఆర్ యస్ లో అంతా గుంభనం…మరికొద్ది రోజుల్లో సీట్ల ప్రకటన అంటూ సంకేతాలు …

Drukpadam

Leave a Comment