Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ధాన్యం ఇతరదేశాల నేరుగా ఎగుమతి చేయాలి …ఏపీ సీఎం జగన్

ధాన్యం ఇతరదేశాల నేరుగా ఎగుమతి చేయాలి …ఏపీ సీఎం జగన్
రంగుమారిన ,తడిసిన ధాన్యంకు రేటు విషయంలో తేడారాకూడదు
ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో డబ్బులు చెల్లించాలి
కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు
పౌరసరఫరాల ధ్యానం సేకరణ పై సమీక్ష చేపట్టిన సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాలు, ధాన్యం సేకరణపై సమీక్ష చేపట్టారు.

సోమవారం ఆయన తాడేపల్లిలోని తాన క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్‌పీ ధర లభించాలన్నారు. రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలన్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..:రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు .ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదు.తరచుగా రైతులతో ఇంటరాక్ట్‌ అవ్వాలి.

రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు .కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి. ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదు

ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది .కొనుగోలు కోసం ఆర్బీకేలో ఐదుగురు సిబ్బంది ధాన్యం కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఉండాలి.

టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలి.
ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి.
వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారితో ఇంటరాక్ట్‌ అయ్యి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలి. వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు.

21 రోజులలోగా పేమెంట్స్‌…

ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలి సీఎం ఆదేశించారు .అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టాలని అన్నారు .

Related posts

ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు?: డెక్కన్ క్రానికల్ వ్యవహారంపై విశాఖ ఎంపీ భరత్

Ram Narayana

ఏపీ డీజీపీ విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశం!

Drukpadam

విటమిన్ డి తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ప్రమాదమే!

Drukpadam

Leave a Comment