Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జపాన్ కుబేరుడు అంతరిక్ష యాత్ర సక్సెస్… సురక్షితంగా భూమి పైకి!

జపాన్ కుబేరుడు అంతరిక్ష యాత్ర సక్సెస్… సురక్షితంగా భూమి పైకి!
-2023 డియర్ మూన్ కు రంగం సిద్ధం
-స్పేస్​ఎక్స్ స్టార్​షిప్ రాకెట్​లో చంద్రుడి మీదకు
-ఇందుకు 8 మందిని సిద్ధం చేస్తున్న యుసాకు మెజవా
-8 మందికి అయ్యే ఖర్చులు తానే భరిస్తానని వెల్లడి

జపాన్ కుబేరుడి రోదసి యాత్ర దిగ్విజయంగా ముగిసింది. అంతరిక్ష పర్యటనకు వెళ్లిన బిలియనీర్, ఫ్యాషన్ రంగ దిగ్గజం యుసాకు మెజవా (46) సురక్షితంగా భూమిని చేరుకున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 12 రోజులు గడిపిన అనంతరం.. భూమికి తిరిగివచ్చారు. మెజవాతో పాటు ఆయన ప్రొడ్యూసర్ యొజో హిరానో, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ మిసుర్కిన్ సైతం సురక్షితంగా భూమిపై దిగారు. కజకిస్థాన్​లోని జెజ్కాగన్ ప్రాంతానికి 148 కి.మీ దూరంలో సోమవారం ఉదయం 9.13 గంటలకు ల్యాండ్‌ అయ్యారు.

2009 తర్వాత సొంత ఖర్చులతో రోదసిలోకి బయల్దేరిన పర్యాటకులు వీరే. ఈ పర్యటన కోసం యుసాకు మెజవా భారత కరెన్సీలో రూ. 600కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈనెల 8న కజకిస్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్ష యాత్ర చేపట్టారు. మిసుర్కిన్​తో కలిసి సోయూజ్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి వ్యోమగాములకు ‘ఉబర్​ ఈట్స్’ సంస్థ ఆహార పదార్థాలను పంపించగా.. మెజవా వాటిని చేరవేశారు.

చంద్రుడిపైకి వెళ్లేందుకు కూడా మెజవా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘డియర్ మూన్’ అని పేరు పెట్టారు. 2023లో ఈ మిషన్​ను చేపట్టనున్నారు. స్టార్‌షిప్ రాకెట్​లో చంద్రుడి మీదకు వెళ్లే తొలి ప్రయాణికుడిగా మిజవా పేరును స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ 2018లోనే ప్రకటించారు. స్పేస్​ఎక్స్ స్టార్​షిప్ రాకెట్​లో చంద్రుడి మీదకు వెళ్లేందుకు ఎనిమిది మందిని మెజవా ఆహ్వానించారు. ఇందుకోసం ఓ పోటీ ప్రారంభించారు. పోటీలో గెలిచినవారి యాత్రకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరించనున్నట్లు ప్రకటించారు. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఎంపిక ప్రక్రియ గురించి ఈ మెయిల్ పంపిస్తామని వివరించారు

Related posts

సూడాన్‌లో కొనసాగుతున్న ఘర్షణలు.. 400 మందికిపైగా మృతి…

Drukpadam

రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ వార్నింగ్…

Drukpadam

11 ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్న తెలంగాణ మహిళ తమిళనాడులో ప్రత్యక్షం!

Drukpadam

Leave a Comment