Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి!

ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా కాంగ్రెస్ : రేవంత్ రెడ్డి!
ఫలితాల విషయంలో విద్యార్థులకు న్యాయం జరగాల్సిందే
ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదల
51 శాతం మంది ఫెయిల్
ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఇటీవల విడుదల కాగా, 51 శాతం మంది ఫెయిలయ్యారు. ముగ్గురు విద్యార్థులు ఫలితాల తీరు పట్ల మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడగా, విపక్షాలు టీఆర్ఎస్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ క్రమంలో నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులు హైదరాబాదులో భారీ ర్యాలీ చేపట్టారు.

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఫలితాల విషయంలో న్యాయం జరిగేంత వరకు ఇంటర్ విద్యార్థులకు తాము మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల నిరసనలను అణచివేసే బదులు, వెంటనే సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. బలవన్మరణం బాట పట్టకుండా విద్యార్థులను కాపాడాలని, ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంట చెడ్డగా ఫలితాలు ఎపుడైనా వచ్చాయా విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. గతంలో పరీక్షా ఫలితాల్లో తేడాలు వచ్చాయి. ఇప్పడు కూడా అదే తీరు అని విమర్శలు గుప్పించారు .

10 – 20 శాతం కాదు ఏకంగా 51 మంది విద్యార్థులు ఫెయిల్ కావడంపై తల్లితండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే చదువు ,ఇదే విద్యావిధానం అంటూ రోడ్ ఎక్కుతున్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి ఇంటర్ విద్యార్థులను ఫెయిల్ చేయడంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా చేశానని చెప్పుకోవాలని అంటున్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారికీ అండగా ఉంటామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts

అసోం సీఎంపై గీతారెడ్డి, రేణుకా చౌదరి ఫిర్యాదు!

Drukpadam

బిగ్ బాస్ హౌస్ పై నారాయణ కామెంట్ …కేసుపెడతానన్న నాగార్జున పెట్టుకోమన్న నారాయణ!

Drukpadam

కేసీఆర్ ను వదిలే ప్రసక్తి లేదు …కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి …

Drukpadam

Leave a Comment