Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దలైలామాతో భేటీ అయిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్!

దలైలామాతో భేటీ అయిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్!

  • ధర్మశాలలో దలైలామాను కలిసిన మోహన్ భగవత్
  • ప్రపంచ పరిస్థితులపై చర్చించామన్న భగవత్
  • ప్రవాస టిబెటన్ అధ్యక్షుడిని కూడా కలిసిన ఆరెస్సెస్ చీఫ్

ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కలిశారు. ధర్మశాలలోని దలైలామా నివాసానికి వెళ్లిన మోహన్ భగవత్ దాదాపు గంటసేపు ఆయనతో చర్చలు జరిపారు. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు తనను కలవడానికి దలైలామా అనుమతిని ఇవ్వలేదు. ఈ నెల 15 నుంచి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రవాస టిబెటన్ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ ను కూడా మోహన్ భగవత్ కలిశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల, కాంగ్రాలో ఐదు రోజుల పర్యటనలో భగవత్ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై దలైలామాతో చర్చించినట్టు తెలిపారు.

Related posts

అంతర్జాతీయ ప్రయాణికులపై కీలక నిబంధనను ఎత్తివేసిన కేంద్రం!

Drukpadam

కేంద్ర కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి గైర్హాజరు.. రాజీనామా చేసినట్టు ఢిల్లీలో ప్రచారం

Drukpadam

కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని అభినందించిన టీడీపీ అధినేత చంద్రబాబు…

Drukpadam

Leave a Comment