Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ నేత సుబ్బారావు గుప్తా కు నిన్న దెబ్బలు నేడు కేకులు…

వైసీపీ నేత  సుబ్బారావు గుప్తా కు నిన్న దెబ్బలు నేడు కేకులు…
దాడి నేప‌థ్యంలో మంత్రి బాలినేనిని కలిసిన సుబ్బారావు..
ప‌ర‌స్ప‌రం కేకు తినిపించుకున్న వైనం
భేటీతో స‌మ‌సిన వివాదం
దాడుల సంస్కృతికి ముగింపు పలకాలన్న గుప్తా
కేసు పెట్టే ఉద్దేశం లేద‌ని వ్యాఖ్య‌

ఒంగోలు వైసీపీ నేత మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా ఉన్న సుబ్బారావు గుప్తా పై అదే పార్టీకి చెందిన నేతలు దాడిచేసి కొట్టారు. కొద్దిరోజుల క్రితం బాలినేని శ్రీనివాస్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ మంత్రి కోడలి నాని , ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ , అంబటి రాంబాబు ల మాటల వల్ల వైపుకి నష్టం జరుగుతుందని అందువల్ల వారిని ఆలా మాట్లాడకుండా నిరోదించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అంతే కాకుండా వారిమాటల వీడియో ను సీఎం జగన్ కలిసి అందజేస్తానని పేర్కొన్నారు. అదికూడా బహిరంగంగా చెప్పడంపై వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోయాయి. దీంతో ఆరోజునుంచే సుబ్బారావు కు వార్నింగ్ లు వచ్చాయి. దీంతో భయపడి ఆయన అదృశ్యం అయ్యారు. ఆయన్ను ఎక్కడున్నాడో గుర్తించిన వైసీపీ కార్యకర్తలు కొందరు వెళ్లి విఫరీతంగా కొట్టి క్షమాపణలు చెప్పించారు. ఈవిషయం సోషల్ మీడియా లో వైరల్ అయింది. దీంతో దిద్దుబాటు చర్యలు వైసీపీ చేపట్టింది. అందులో భాగంగా ఆయన్ను ఈ రోజు తీసుకొచ్చి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రి బాలినేని ఆయనకు కేక్ తినిపించారు. బాలినేని ఆనుయాయిలు దెబ్బలు కొట్టడం ఆయన కేక్ తినిపించడంపై ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.

వైసీపీ నేత‌ సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీ నేత‌లు జరిపిన‌ దాడి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దృశ్యాలు వైరల్‌ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. దీనిపై ఇప్ప‌టికే స్పందించిన సుబ్బారావు గుప్తా త‌న‌కు మతిస్థిమితం బాగానే ఉంద‌ని చెప్పారు. త‌న‌కు ఎవరిపైనా కేసు పెట్టే ఉద్దేశం కూడా లేదని చెప్పారు. దాడుల సంస్కృతికి తనతోనే ముగింపు పలకాలని ఆయ‌న పేర్కొనడం గ‌మ‌నార్హం.

విజ‌య‌వాడలో మంత్రి బాలినేనిని కలిసిన నేప‌థ్యంలో త‌న‌పై జరిగిన దాడి ఘ‌టన వివరాలను ఆయనకు గుప్తా వివరించినట్లు సమాచారం. తాను ఎప్పుడూ బాలినేనికి, వైసీపీకి విధేయుడినేనని ఆయ‌న అన్నారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రమే తాను వ్యాఖ్యలు చేసినట్లు ఆయ‌న వివ‌రించారు. అక్క‌డే సీఎం జగన్‌ జన్మదినోత్స‌వం సంద‌ర్భంగా కేక్‌ కట్‌ చేసి మంత్రి, సుబ్బారావు గుప్తా పరస్పరం తినిపించుకున్నారు.

Related posts

అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ లో భయం : హన్మకొండ సభలో జేపీ నడ్డా!

Drukpadam

జగన్ కు అగ్ని పరీక్షగా మారిన క్యాబినెట్ మార్పు …

Drukpadam

ఏపీ లో నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపు…

Drukpadam

Leave a Comment