Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

దుబాయ్ నుండి డిల్లీకి వచ్చిన పదిమందికి ఒమైక్రాన్…

దుబాయ్ నుండి డిల్లీకి వచ్చిన పదిమందికి ఒమైక్రాన్…
-ఢిల్లీలో మొత్తం 57 ఓమిక్రాన్ కేసులు
-మహారాష్ట్ర ,ఢిల్లీలలో కేసులు అధికం
-విదేశాలనుంచి వచ్చే వారికీ ఎయిర్ పోర్ట్ లలో పరీక్షలు
-వివిధ రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
-న్యూ ఇయర్ వేడుకల రీత్యా ఆంక్షల దిశగా ఆలోచన

దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన 10 మంది ప్రయాణికులకు ఒమైక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మొత్తం 57 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి
ఢిల్లీ ,మహారాష్ట్రలలో అధికంగా ఓమిక్రాన్ కేసులు

ఓమిక్రాన్ కేసులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అమెరికా ,బ్రిటన్ దేశాలలో కేసుల సంఖ్య పెరుగుతుంది. భారత్ లో ఇప్పుడిప్పుడే కేసులు పెరుగుతున్నాయి. వివిధ దేశాలనుంచి భారత్ వచ్చే వారి నుంచి అధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం . వివిధ రాష్ట్రాలలో ఓమిక్రాన్ పై ప్రభుత్వం ద్రుష్టిసారించాయి. ప్రధాని మోడీ సైతం ఓమిక్రాన్ పై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు . న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నెల 31 ,జనవరి 1 తేదీలలో కఠిన ఆంక్షలు విధించాలని ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.

22 మంది ప్రయాణికులు విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారికి కరోనా వచ్చింది. దుబాయ్ దేశం నుంచి వచ్చిన 10మందికి ఒమైక్రాన్ అని తేలింది. దీంతో పాటు యూకే నుంచి వచ్చిన నలుగురికి, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి, టాంజానియా నుంచి వచ్చిన ఇద్దరికి, జింబాబ్వే నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి ఒమైక్రాన్ సోకింది.

డిసెంబరు 5వతేదీన ఢిల్లీలో మొట్టమొదటి ఒమైక్రాన్ కేసు వెలుగుచూసింది. ఆయనను లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్చారు.ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ గతంలో ఒమైక్రాన్ పేషెంట్‌కు గొంతునొప్పి, జ్వరం వచ్చిందని చెప్పారు.

రోగి శరీర నొప్పి, బలహీనతతో కూడా బాధపడుతున్నాడు. అయితే ఆక్సిజన్ స్థాయి తగ్గుదల నమోదు కాలేదు.బుధవారం ఉదయం నాటికి భారతదేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 213కి పెరిగింది. మహారాష్ట్ర,ఢిల్లీ వరుసగా 65,57 ఒమైక్రాన్ కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. భారతదేశంలో ఒమైక్రాన్

Related posts

తొలి డోసు ఒక వ్యాక్సిన్.. రెండో డోసు మ‌రొక‌టి వేయించుకోవ‌ద్దు: డ‌బ్ల్యూహెచ్‌వో!

Drukpadam

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు….ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం…

Drukpadam

ఏపీలో కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల…

Drukpadam

Leave a Comment