Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముందస్తు ఎన్నికలకోసమే కేసీఆర్ హడావుడి చేస్తున్నారా ?

ముందస్తు ఎన్నికలకోసమే కేసీఆర్ హడావుడి చేస్తున్నారా ?
-కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చుఅంటున్న అమిత్ షా
-తెలంగాణ నేతలతో సమాలోచనలు చేసిన అమిత్ షా
-ముందస్తు ఎన్నికలకోసమే కేసీఆర్ హడావుడి
-అందుకే కేంద్రంతో యుద్ధం అంటున్నారు
-అనేక నియోజకవర్గాలలో అభ్యర్థుల మార్పు కోసం కసరత్తు
-అందుకే మార్పులేందని అంటున్నారు
-కనీసం 40 నియోజకవర్గాలలో మార్పుకు అవకాశం

ఒకపక్క జమిలి ఎన్నికల పై కేంద్రం ఆలోచనలు చేస్తున్న వేళ మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై స్వయానా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చెప్పడం ఆశక్తిగా మారింది. తెలంగాణ నేతలతో జరిపిన సమావేశంలో అమిత్ షా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమౌతున్నట్లు తెలుస్తుందని అందువల్లనే కేంద్రంపై యుద్ధం అంటూ హడావుడి చేస్తున్నారని కేసీఆర్ మాటల వెనక ఉద్దేశాలు ,వ్యూహాలు వేరే ఉంటాయని కూడా అమిత్ షా బీజేపీ నేతలతో అన్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ కుంభకోణాలపై కూడా అమిత్ షా మాట్లాడినట్లు సమాచారం .

కేంద్రమంత్రి అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికలపై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.

సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చని అమిత్‌షా తెలిపారు. ఈ సారి కూడా ముందుస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు కోసం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకోసమే కేసీఆర్, కేంద్రంతో యుద్ధాని రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఈసారి శాసససభ్యుల టికెట్ల విషయంలో సీఎం కేసీఆర్‌ సరికొత్తగా ముందుకువెళ్లనున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

నియోజకవర్గాల్లో శాసనసభ్యులపై ఉన్న వ్యతిరేకత టీఆర్‌ఎస్‌పై పడకుండా ఉండేందుకు సిట్టింగ్స్‌కు ఈసారి నో ఛాన్స్‌ చేప్పే అవకాశముందనే టాక్ వస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశమిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకునేలా కేసీఆర్‌ ప్లాన్ చేస్తున్నట్లు లీకులొస్తున్నాయి. టికెట్‌దక్కని సిట్టింగ్స్‌లో తమ పేరు ఉంటుందేమో అనే ఆందోళన శాసనసభ్యుల్లో రోజురోజుకీ ఎక్కువవుతున్నట్లు నియోజకవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కమలం నేతలు కూడా అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా ముందుకు పొతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాతో రాష్ట్ర నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటున్నాం: రేవంత్ రెడ్డి!

Drukpadam

భాదితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం …సీఎల్పీ నేత భట్టి …ప్రతిపక్షాలది కడుపు మంట మంత్రి పువ్వాడ …

Ram Narayana

మధు ప్రచారంలో తుమ్మల …

Drukpadam

Leave a Comment