Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఎన్నికల ప్రచార వేళ అఖిలేష్ ఇంట కోవిడ్ కలకలం!

ఎన్నికల ప్రచార వేళ అఖిలేష్ ఇంట కోవిడ్ కలకలం!
అఖిలేష్ భార్య, కూతురికి కరోనా
వారిని ఐషోలేషన్ ఉంచారు

అఖిలేష్ ప్రచారానికి ఇబ్బందులు
అయితే ఇంకా ఎన్నికల షడ్యూల్ రాకపోవడం కలిసొచ్చే అవకాశం

ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎస్పీ అధ్యక్షుడు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు జరుపుతున్నారు . రాష్ట్రంలో విస్తృత పర్యటనలు జరుపుతున్నారు . ఈసమయంలో ఆయన భార్యకు ,కూతురుకు కరోనా సోకడం కొంత నిరుత్సాహాన్ని తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు .అయినప్పటికీ వారిని ప్రత్యేక ఐషోలేషన్ ఉంచారు . అయితే ఇంకా ఎన్నికల షడ్యూల్ ప్రకటించలేదు కాబట్టి ఎస్పీ కి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చునని అంటున్నారు. ఎస్పీ ప్రచారం అంతా అఖిలేష్ పైనే ఉంది. అందువల్ల ఎస్పీ శిభిరంలో ఆందోళన వ్యక్తం అవుతుంది.

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టినా యాదవ్ కోవిడ్ బారినపడ్డారు.వీరిద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని,ప్రస్తుతం లక్నోలోని తమ నివాసంలోనే వీరు ఐసొలేట్ అయినట్లు సమాచారం. వీరిద్దరి సోకింది కోవిడ్ కొత్త వేరియంటా “ఒమిక్రాన్” అన్నది తేల్చేందుకు శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు అధికారులు. ఇక,వీరి కుటుంబంలోని సిబ్బందికి కూడా కోవిడ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కాగా,అఖిలేష్ యాదవ్ ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో అఖిలేష్ కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.

Related posts

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌ర‌మే.. కానీ..!: బైడెన్

Drukpadam

ఆనందయ్య మందు ఆయుర్వేద ఔషధం కాదు: ఆయుష్ కమిషనర్ రాములు….

Drukpadam

లాక్‌ డౌన్‌కు వ్యతిరేకంగా చైనాలో ఆగ్రహ జ్వాలలు..

Drukpadam

Leave a Comment