Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

యాసంగిలో వరి కొనకుంటే బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలకు ఉరే : సీఎల్పీ నేత భట్టి…

యాసంగిలో వరి కొనకుంటే బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలకు ఉరే : సీఎల్పీ నేత భట్టి…
-వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి బిజెపి టిఆర్ఎస్ కుట్ర
-దోచుకున్న రాష్ట్ర సంపదను కెసిఆర్ కుటుంబంతో కక్కిస్తాం
-అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని టీఆర్ యస్ చూస్తుంది.
-తమపోరాటం ఫలితంగానే దళిత బందు
-డిజిటల్ సభ్యత్వాలలో మధిర మొదటి స్థానంలో నిలవాలని అన్నారు

ధాన్యం కొనుగోలు చేయని పక్షంలో నష్టపోయిన రైతులు తామంతట తామే వ్యవసాయ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తారన్న కుట్రతోనే బిజెపి ,టిఆర్ఎస్ లు వ్యవహరిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు . వడ్లు కొనకుంటే బీజేపీ ,టీఆర్ యస్ లకు ఉరే హెచ్చరించారు . ముదిగొండ మండలం చిరుమర్రిలో జరిగిన ఆపార్టీ సమావేశంలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు .

వ్యవసాయ చట్టాలను రద్దు చేయించి నట్టుగా, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని వెల్లడించారు. రైతులు అధైర్యపడవద్దని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చివరి ధాన్యం కొనుగోలు చేసేంత వరకూ కాంగ్రెస్ పార్టీ అన్నదాతలకు అండగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను పీల్చి పిప్పి చేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే ఊరుకోమనన్నారు. అభివృద్ధి పేరిట కెసిఆర్ కుటుంబం దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని అన్నారు . కృష్ణా గోదావరి బేసిన్ పైన ప్రాజెక్టులు కట్టి లక్షల ఎకరాలను కాంగ్రెస్ పార్టీ సస్యశ్యామలం చేసిన విషయం గుర్తు చేశారు . కానీ సీఎం కేసీఆర్ నాలుగు లక్షల కోట్లు అప్పు , 12 లక్షల కోట్ల బడ్జెట్తో ఒక ఎకరానికి కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. రీడిజైన్ పేరిట కాలేశ్వరం అంచనాలను 1.25 లక్షల కోట్లకు పెంచి, 81 వేల కోట్లు ఖర్చు చేసి ఏడేళ్లలో లో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వని కెసిఆర్ ఆసమర్ధ ముఖ్యమంత్రి అని ధ్వజ మెత్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కు నిధులు కేటాయించకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు నిర్మిస్తారని నిలదీశారు. పోరాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేసీఆర్ పక్కదారి పట్టించాడని , అసెంబ్లీ వేదికగా తాను పోరాటం చేసిన ఫలితంగానే ఆ నిధులతో దళిత బందు పథకాన్ని కెసిఆర్ తీసుకు వచ్చాడని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తరహాలోనే బీసీలకు సబ్ ప్లాన్ చట్టం రావాల్సిన అవసరం ఉన్నందున వచ్చే శాసనసభ సమావేశాల్లో బీసీల గొంతు గా తన గళాన్ని వినిపిస్తానని తెలిపారు. బీసీల కులగణన చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. ధరణి పేరిట సీఎం కేసీఆర్ కుటుంబం భూమి అక్రమాలకు పాల్పడి వేల కోట్లు సంపాదించిందని, మిషన్ భగీరథ మిషన్ కాలేశ్వరం పథకాల్లో కమీషన్ల పేరిట అవినీతికి పాల్పడిన వేల కోట్లను వచ్చే 2023 ఎన్నికల్లో వెదజల్లి గెలవాలని చూస్తే ప్రజలు సహించరని, మధిర నియోజకవర్గ ప్రజలు చెప్పిన గుణపాఠం మాదిరిగానే తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నూతనంగా తీసుకువచ్చిన కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విస్తృతంగా చేపట్టి రాష్ట్రంలో మధిర నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచడం కోసం కాంగ్రెస్ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు , రాయల నాగేశ్వరరావులు మాట్లాడుతూ టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు చేస్తూ రైతుల ప్రాణాలను హరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 రోజుల్లో 206 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ ఆత్మహత్యల తెలంగాణగా మార్చుతున్నాడని ధ్వజ మెత్తారు. రాజకీయ పరిపక్వత లేకుండా , కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఎమ్మెల్యేగా గెలవాలని భట్టి పైన పోటీచేసిన ప్రత్యర్థి నియోజకవర్గంలో పిల్ల చేష్టలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయ పరిజ్ఞానం లేని అతను మధిరలో పోటీ చేయడానికి అనర్హుడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలను కాంగ్రెస్ నిర్వహించిన ఉద్యమాల్లో భాగస్వామ్యం చేయించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.

అంతకుముందు గ్రానికి వచ్చిన భట్టి విక్రమార్క కి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొబ్బల సౌజన్య, బుల్లెట్ బాబు, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మొక్క శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, పుచ్చకాయల వీరభద్రం, మహమ్మద్ జావిద్, మండల నాయకులు కొమ్మినేని రమేష్ , కృష్ణ, ఆనందరావు, శంభయ్య, ధర్మ నాయక్, రామకృష్ణ, అజయ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

వేయి రోజులు.. వేయి తప్పులు: జ‌గ‌న్ పాల‌న‌పై టీడీపీ చార్జిషీట్‌!

Drukpadam

జైల్లో తన భర్త దేవినేని ఉమకు ప్రాణహాని : భార్య అనుపమ!

Drukpadam

కేంద్ర దర్యాప్తు సంస్థలపట్ల జాగ్రత్త :మంత్రులతో కేసీఆర్!

Drukpadam

Leave a Comment