నాసా నుంచి మరో తీవ్రమైన హెచ్చరిక…!
-పొంచి ఉన్న సౌర తుఫానులు..!
-భూమివైపుకు వచ్చే అవకాశాలు ఉన్నయన్న నాసా
నాసా మరో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. సూర్యుడిపై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా సౌరతుఫానులు ఏర్పడే అవకాశం ఉందని, ఈ సౌర తుఫానులు భూమివైపు త్వరలోనే దూసుకొచ్చే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. అతిత్వరలోనే రెండు సౌరతుఫానులు భూమిని తాకే అవకాశం ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యునిలో ప్రతి 11 ఏళ్లకు ఒకసారి మాగ్నెటిక్ సైకిల్ ఓవర్ డ్రైవ్ అవుతుంటుంది. ఆ సమయంలో సూర్యునిలో ఉండే అయస్కాంత దృవాలు మారుతుంటాయి.
అయస్కాంత దృవాల్లో మార్పులు జరిగే సమయంలో భారీ శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి సౌరతుఫాన్‌గా మారి భూమివైపు దూసుకొచ్చే అవకాశం ఉందని, దీని వలన భూమికి అనేక ఇబ్బందులు వస్తాయని నాసా పేర్కొన్నది.
ఒకవేళ ఈ సౌరతుఫాన్ భూమిని తాకితే రెడియో కమ్యునికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. జీపీఎస్ సేవలకు అంతరాయం కలగవచ్చు. ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంటుంది. పవర్ గ్రిడ్‌లపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.