ఇకపై మీ ఆటలు సాగవ్ పోలీసులకు సి.యం. రమేష్ హెచ్చరిక..
-రాష్ట్ర పోలీసుల తీరును కేంద్ర ప్రభుత్వం టెలిస్కోప్‌తో చూస్తోందని వెల్లడి
-కొందరు ఐపీఎస్ లను కేంద్రం రీకాల్ చేస్తుందన్న రమేష్
-ప్రక్షాళన ఖాయం …మీఇష్టం వచ్చునట్లు చేసే కుదరదు …
బీజేపీ కు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కేంద్రం మీ చర్యలను టెలిస్కోప్ తో చేస్తుంది.కొంతమంది అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. కొంతమంది బీజేపీ నేతలతో కలిసి సీఎం రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు . ఒకరకంగా చెప్పాలంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు . ఐఏఎస్ , ఏపీఎస్ అధికారులను వళ్ళు దగ్గరపెట్టుకొని పని చేయాలనీ లేకపోతె చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రానికి అన్ని విషయాలు చెప్పమని వారు త్వరలోనే ఏపీ అధికారుల తీరుపై చర్యలు చేపడతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని విమర్శించారు. ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవరించటంపై మండిపడ్డారు .
రాష్ట్రంలో అనేక వ్యవస్థలూ దీనావస్థలో ఉన్నాయని, మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని భాజపా ఎంపీ సీఎం రమేశ్ విమర్శించారు.
రాష్ట్ర పోలీసుల తీరును కేంద్ర ప్రభుత్వం టెలిస్కోప్‌తో చూస్తోందన్నారు. త్వరలో వ్యవస్థను ప్రక్షాళన చేసేలా చర్యలు ఉంటాయని తెలిపారు. అవసరమైతే కొందరు ఐపీఎస్‌లను కేంద్రం రీకాల్ చేస్తుందని తెలిపారు. ”ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి, హోంశాఖ కార్యదర్శికి ఇక్కడేం జరుగుతుందో వివరించాం. వారు ఇక్కడ టెలిస్కోప్‌లో చూస్తున్నారు. త్వరలో ఈ పోలీస్ వ్యవస్థపై పెద్ద ప్రక్షాళన ఉంటుందని తెలియజేస్తున్నా. ఇకమీదట మీ ఆటలు సాగవు. ప్రజలకు ఏది న్యాయమైతే అది చేయాలి. మీకొక యాక్ట్ ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఇచ్చిన శిక్షణను ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రభుత్వాలు ఉంటాయి.. పోతాయి. కానీ వ్యవస్థలు ఎప్పటికీ ఉంటాయి. వ్యవస్థలకు చెడ్డపేరు తీసుకురావొద్దని ఐఏఎస్, ఐపీఎస్‌లకు గుర్తుచేస్తున్నా” అని తెలిపారు.