Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం!

హిమాన్షుపై వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ చానల్బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం!
అభివృద్ధి ఎక్కడ జరిగిందన్న క్యూ న్యూస్
భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..? అంటూ వ్యాఖ్యలు
బీజేపీ హైకమాండ్ ను ప్రశ్నించిన కేటీఆర్
ఇదేనా మీరు నేర్పిస్తోంది?అంటూ ఫైర్

పాత్రికేయుడు తీన్మార్ మల్లన్న ఇటీవల బీజేపీలో చేరడం తెలిసిందే. అయితే తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ చానల్ సోషల్ మీడియాలో నిర్వహించిన పోల్ మంత్రి కేటీఆర్ ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇంతకీ ఆ పోల్ లో ఏం అడిగారంటే… అభివృద్ధి ఎక్కడ జరిగింది అని నెటిజన్లను ప్రశ్నించారు. భద్రాచలం గుడిలోనా…? హిమాన్షు శరీరంలోనా…? అని రెండు ఆప్షన్లు ఇచ్చారు.

దీంతో తన కుమారుడి రూపాన్ని విమర్శించడం పట్ల మంత్రి కేటీఆర్ అసహనం ఫీలయ్యారు. బీజేపీ అధినాయకత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ నేతలకు మీరు నేర్పిస్తున్నది ఇదేనా? అసహ్యకరమైన రాజకీయ వ్యాఖ్యల ద్వారా నా బిడ్డ శరీరాకృతిని విమర్శించడం సంస్కారం అనిపించుకుంటుందా? మోదీ కుటుంబాన్నో, అమిత్ షా కుటుంబాన్నో మేం ఈ విధంగా విమర్శించలేమనుకుంటున్నారా? అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కేటీఆర్ ప్రశ్నించారు.

అటు ఈ అంశంపై మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఇలా బురద చల్లేవారిని వదిలేయాల్సిందేనా? అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. “మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా. ఇది తీవ్రమైన సమస్య. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే చట్టాన్ని తీసుకురాలేరా?” అని ప్రశ్నించారు.

అందుకు కేటీఆర్ స్పందిస్తూ… మనం జనజీవనంలో ఎందుకున్నామా అని ఒక్కోసారి అనిపిస్తుంటుందని బదులిచ్చారు. ‘ముఖ్యంగా ఇప్పటి సోషల్ మీడియా యుగంలో ఎవరైనా ఏదైనా సిగ్గులేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రచారం చేస్తున్నారు. జర్నలిజం పేరుతో 24 గంటల పాటు నాన్సెన్స్ సృష్టించే కొన్ని యూట్యూబ్ చానళ్ల రొంపిలోకి చిన్నారులను కూడా లాగుతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

“సర్… దురదృష్టవశాత్తు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఇతరులను దూషించడానికి, బురద చల్లడానికి హక్కులా మారింది. సోషల్ మీడియా జర్నలిజం ముసుగులో పుకార్లు, అనవసరమైన చెత్త అంతా ప్రచారం చేస్తున్నారు. అసాంఘిక ధోరణులకు సోషల్ మీడియా అడ్డాగా మారిపోయింది” అంటూ ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ కు కేటీఆర్ వివరణ ఇచ్చారు.

Related posts

సండ్ర కు లైన్ క్లియర్ అయినట్లేనా?

Drukpadam

చైనాను వెన‌క్కు త‌గ్గేలా చేసిన భార‌త్‌.. కీల‌క ప్రాజెక్ట్ నిలిపివేత‌!

Drukpadam

వైసీపీ నేతల అవినీతి గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారు : చంద్రబాబు!

Drukpadam

Leave a Comment