Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన కేంద్రం: సీతారాం ఏచూరీ!

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన కేంద్రం: సీతారాం ఏచూరీ!
-విశాఖ ఉక్కు ప్రవేటీకరణ చేస్తున్నారు
-రాష్ట్ర విభజన హామీలు అమలుకు నోచుకోలేదు
-పోలవరం ప్రాజెక్టులు పనులు జరగటంలేదు
-రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయి
-ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలు వెనక్కి
-దేశంలో ఆందోళనకర పరిస్థితులు

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానన్న కేంద్రం ఇవ్వకుండా మోసం చేసిందని ,పైగా ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రవేటీకరన్ చేస్తుందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు..దేశ సంపద, కొద్దిమంది చేతుల్లో పెట్టేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు . ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో దోచేస్తున్నారని దేశంలో కార్మిక ,రైతు ,విద్యార్ధి , యువజన ,మహిళా , ఉద్యోగ వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం అధికారం లో ఉందని విమర్శించారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో సోమవారం(డిసెంబర్ 27,2021) ప్రారంభమైన సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయట్లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగడం లేదన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. రైతులు, కార్మికులు, కర్షక వర్గాలను ఐక్యం చేసి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.

హిందూత్వ ఉన్మాదంతో దేశాన్ని కలుషితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన ఉద్దీపన ప్యాకేజీతో కంపెనీలకు లాభాలు పెరుగుతున్నాయని.. సామాన్యులకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చిలీ, పెరూ వంటి దేశాల్లో కమ్యూనిస్టులు బలపడుతున్నారని తెలిపారు.
మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో చర్చించి, రాజకీయ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సీతారాం ఏచూరీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, మహాసభలను ప్రారంభించారు. మహాసభలకు ఏచూరీతోపాటు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బీవీ.రాఘవులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజులపాటు మహాసభలు జరుగనున్నాయి.

“బీజేపీయేతర పార్టీలను ఒకే వేదిక పైకి తెస్తే”…విభజనే ఎక్కువ :సిపిఎం నేత బివి రాఘవులు

 

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అనేదే మంచి నినాదం కాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ఐక్యత కంటే విభజన ఎక్కువగా జరుగుతుందన్నారు.
అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, వాటి మధ్య పోటీ ఉందన్నారు. రాజకీయంగా జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఒకే వేదికపైకి తెస్తే తగాదాలు మరింత పెరుగుతాయని ఆయన సూచించారు. రాజకీయంగా బీజేపీయేతర పార్టీలను తెచ్చే ప్రయత్నం చేయడం వృధా ప్రయాసేనన్నారు.

 

Related posts

అజిత్ చర్యతో మేల్కొన్న శరద్ పవార్ …రాష్ట్ర వ్యాపిత పర్యటనకు సిద్ధం …

Drukpadam

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వండి …. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి భావిరంగా లేఖ …

Drukpadam

సర్పంచ్ గా గెలుపొందిన స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య

Drukpadam

Leave a Comment