Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భారతీయ జగన్ పార్టీగా మారిన బీజేపీ: పయ్యావుల

భారతీయ జగన్ పార్టీగా మారిన బీజేపీ: పయ్యావుల
-ఏపీ లో ఆరాచక పాలనా సాగుతుంది.
-జగన్ ఏమి చేసిన బీజేపీ నోరు మెదపటం లేదు ..
-ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందని అన్నారు
-హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నా మౌనంగా ఉన్నారు
-అశోకగజపతి మీద దాడి జరిగిన కిమ్మనలేదు

బీజేపీ పై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు .ఏపీ లో జగన్ ప్రభుత్వం ఏమి చేసిన బీజేపీ మాట్లాడకపోవడం దారుణమని ధ్వజమెత్తారు . రాష్ట్రంలో అనేక అరాచకాలు జరుగుతున్నా బీజేపీ కి పెట్టడంలేదని అది మౌనంగా ఉంటుందని దుయ్యబట్టారు . బీజేపీ భారతీయ జనతా పార్టీ గా కాకుండా తనపేరు ఏపీ లో భారతీయ జగన్ పార్టీగా మారిందని మండిపడ్డారు. అందువల్ల బీజేపీకి రాష్ట్రంలో క్రెడిబులిటీ లేకుండా పోయిందని విమర్శించారు.

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరిగినా బీజేపీ మౌనంగా ఉంటుందని మండిపడ్డారు.

ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి జరిగినా పట్టించుకోలేదన్నారు. హిందుత్వ అంశాలపై కూడా బీజేపీ మౌనం వహిస్తోందని అన్నారు. ధర్మకర్త అశోక్‌గజపతిరాజుపై దాడి జరిగినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆర్థిక అరాచకాలపై బీజేపీ నేతలు నోరెత్తట్లేదన్నారు. కేంద్రం నిధులను దారిమళ్లిస్తున్నా బీజేపీ నేతలకు పట్టడంలేదని అన్నారు. బీజేపీ.. భారతీయ జగన్ పార్టీగా మారిందని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.

Related posts

చంద్రబాబును దీవించాలంటూ నోరు జారిన తెలంగాణ మంత్రి!

Drukpadam

సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం దారుణం: బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు

Drukpadam

కులం పునాదులపై ఏ పార్టీనీ నిర్మించలేము…విజయసాయి రెడ్డి

Drukpadam

Leave a Comment