Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సోము వీర్రాజును ఇకపై ‘సారాయి వీర్రాజు’ అని పిలవాలేమో…సీపీఐ రామకృష్ణ!

సోము వీర్రాజును ఇకపై ‘సారాయి వీర్రాజు’ అని పిలవాలేమో!: సీపీఐ రామకృష్ణ వ్యంగ్యం!

  • మద్యం కారుచౌకగా అందిస్తామన్న సోము వీర్రాజు
  • రూ.50కే క్వార్టర్ సీసా ఇస్తామని వెల్లడి
  • తీవ్రంగా స్పందించిన సీపీఐ రామకృష్ణ
  • సోము వీర్రాజుకు మతిభ్రమించినట్టుందని వ్యాఖ్యలు

 

సోము వీర్రాజు చీఫ్ లిక్కరును 50 రూపాయలకే క్వార్టర్ ఇస్తాం మాకు ఓట్లు వేయండి అని పిలుపు నిచ్చారు . దీనిపై దుమారం రేగింది.బీజేపీ ఏపీ చీఫ్ ఎలాంటి చీఫ్ మాటలు మాట్లాడటం ఏమిటి ? అధికారం కోసం ఏ అడ్డదార్లు అయినా తొక్కుతారా ? అని వివిధ పార్టీలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే మాటలు కులాలు రెచ్చగొట్టి అధికారంలోకి వస్తుందని అపప్రద మూటగట్టుకున్న బీజేపీ కి సోము వీర్రాజు మాటలు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టి తలలు పట్టుకుంటున్నారు. నామాటలను వక్రీకరించారని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్న అడ్డంగా వీడియో ఫుటేజ్ కి దొరికిపోయే . అసలు ఏపీలో ఉనికి కోసం తెగ ఆరాగా పడుతున్న బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడి చీఫ్ లిక్కర్ మాటలు పార్టీ పరువు తీశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోము వీర్రాజు ను ఇకనుంచి సారాయి వీర్రాజు అనాలేమో అని అంటున్నారు.

తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని కారుచౌకగా అందిస్తామని, క్వార్టర్ బాటిల్ ను రూ.50కే ఇస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే  సోము వీర్రాజుకు మతిభ్రమించినట్టుగా ఉందని అన్నారు.

రాష్ట్రంలో కోటి మంది మందుబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని అనడం సోము వీర్రాజు పిచ్చికి పరాకాష్ఠ అని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజును ఇకనుంచి  ‘సారాయి వీర్రాజు’గా పిలవాలేమో అని వ్యంగ్యం ప్రదర్శించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను చవకగా ఇస్తామని సోము వీర్రాజు చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే, బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తామంటోందని రామకృష్ణ విమర్శించారు.

Related posts

పార్టీ ద్వారా గెలిచి పక్కపార్టీలోకి వెళ్లిన వారికీ మళ్ళీ అవకాశం ఇవ్వొద్దు…రేవంత్ రెడ్డి!

Drukpadam

జిల్లాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ పోటీ చేసినా స‌రే ఓడిస్తా: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి!

Drukpadam

తెలంగాణకు గతంలోనే చెప్పాం… బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ

Drukpadam

Leave a Comment