Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?: రేవంత్ రెడ్డి

పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?: రేవంత్ రెడ్డి
-పేద రాష్ట్రమైన ఝార్ఖండ్ లో పెట్రోల్ ధర త‌గ్గింపు
-లీటరుకు రూ.25 తగ్గించారు
-మనది దేశంలోనే ధనిక రాష్ట్రమని కేసీఆర్ చెబుతారు
-ఆయ‌న‌ ప్రభుత్వం మాత్రం పైసా తగ్గించేది లేదంటోంది

పెట్రో ధరలపై రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది …కొన్ని రాష్ట్రాలు తమకు వచ్చే పన్నులు తగ్గించి వినియోగదారులమీద భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ లీటర్ కు 110 ,డీజిల్ 105 రూపాయలు ,అది ప్రాంతాన్ని భట్టి తేడాలు ఉంటున్నాయి. పెట్రో రేట్లు తగ్గించాలని ప్రతిపక్షాలు నెత్తి నోరు మొత్తుకుంటున్నా పాలకుల్లో చలనం కనిపించడంలేదు . కొన్ని రాష్ట్రాలు తమపన్నులను తగ్గించిన తెలంగాణ లాంటి ధనికరాష్ట్రం తగ్గించకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రత్యేకించి జార్ఖండ్ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ కు 25 తగ్గించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సొరేన్ ప్రకటించారు. దీంతో దేశంలో మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సొరేన్ దారిలో పెట్రోల్ రేట్లు తగ్గించాలనే డిమాండ్ పెరుగుతుంది. ప్రత్యేకించి ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ఎందుకు తగ్గించడంలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ సర్కారుపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పెట్రోలు ధరను లీటరుకు రూ.25 మేర తగ్గిస్తున్నట్టు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ ప్రకటించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. తెల్లకార్డు ఉన్న ద్విచ‌క్ర వాహ‌నాల‌ యజమానులకు వచ్చేనెల 26 నుంచి ఈ అవకాశం కల్పిస్తున్నామ‌ని హేమంత్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రి ధ‌నిక రాష్ట్రం తెలంగాణ‌లో ఆ ప‌ని ఎందుకు చేయ‌ట్లేర‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు.

‘పేద రాష్ట్రమైన ఝార్ఖండ్ లో ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ.25 తగ్గించింది. మనది దేశంలోనే ధనిక రాష్ట్రం అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పైసా తగ్గించేది లేదంటోంది. ఖజానా దివాళా తీసిందా? లేక ప్రజలను ‘పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?’ అని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Related posts

చన్నీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవడు: కేజ్రీవాల్!

Drukpadam

ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని కోరికలేదు …కాంగ్రెస్ నేత హర్ష కుమార్ !

Drukpadam

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం కొందరికి మోదం …కొందరికే ఖేదం…

Drukpadam

Leave a Comment