Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా!

దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియా!

  • రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌటైన దక్షిణాఫ్రికా
  • 113 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం
  • కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై భారత్ 113 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యతను సాధించింది.

రెండో ఇన్నింగ్స్ లో 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఎల్గర్ (77), బవుమా (35), డికాక్ (21) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవరూ రాణించలేదు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి ఇండియాను మెరుగైన స్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ కాగా… సౌతాఫ్రికా 191 పరుగులకు ఆలౌట్ అయింది.

Related posts

వెస్టిండీస్ పై మొదటి టెస్ట్ లో ఇండియా గ్రాండ్ విక్టరీ …!

Drukpadam

అహ్మదాబాద్ వన్డేలో టీమిండియా ఘనవిజయం…సిరీస్ కైవసం

Drukpadam

రవిశాస్త్రిపై రహానే తీవ్ర విమర్శలు…

Drukpadam

Leave a Comment