Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉద్యోగుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం: సీఎల్పీ నేత భట్టి

ఉద్యోగుల జీవితాలతో కెసిఆర్ చెలగాటం

317 జీవో సవరించి బదిలీలకు బ్రేక్ వేయండి

ఉద్యోగి జేతురామ్ మరణం రాష్ట్ర ప్రభుత్వ హత్య

మెడికల్ గ్రౌండ్, స్పౌజ్ ఉద్యోగులకు బదిలీలు మినహాయించాలి

రాష్ట్ర సర్కార్ కు మల్లు భట్టి విక్రమార్క డిమాండ్

ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవో తెచ్చిందని, ఈ జీవోను వెంటనే సవరించి, బదిలీల ప్రక్రియకు తాత్కలికంగా బ్రేక్ వేయాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. స్థానికతకు పాతరపెట్టి 317 జీవో ద్వారా బలవంతపు బదిలీలు చెప్పట్టడం వల్ల మహబూబ్ జిల్లా నెల్లికుదురు మండలం బంజర శివారు సంధ్యాతండాకు చెందిన బానోతు జేతురామ్ గుండెపోటుతో చనిపోయినప్పటికీ, ఇది ప్రభుత్వం చేసిన హత్యగా తాను భావిస్తున్నానని సర్కార్ నిప్పులు చెరిగారు. జేతురామ్ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రీఅలాట్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆనాలోచిత నిర్ణయాలే ఉద్యోగి మృతికి కారణమయ్యాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగుల పరిస్థితి ఇదే విధంగా ఉన్నట్టు వారు చేస్తున్న ఆందోళనలను బట్టీ తెలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంకై సకల జనుల సమ్మె నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు తమ జీవితాలను, ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యోగులు పోరాటం చేశారని, తెలంగాణ కోసం పోరాడిన వారి త్యాగాలను విస్మరించిన సీఎం కెసిఆర్
ఇప్పుడు వారిని రాచి రంపాన పెట్టడం సరికాదని అన్నారు. ఉద్యోగుల ఆందోలనలు, కాంగ్రెస్ నేతలు ప్రదర్శించిన పోరాట తెగువ, విద్యార్థుల బలిదానాలకు చలించిన సోనియాగాంధి తెలంగాణ రాష్ట్రం ఇస్తే బంగారు తెలంగాణ చేస్తానని అధికారంలోకి వచ్చిన సిఎం కెసిఆర్ ప్రభుత్వం రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే తెలంగాణగా మార్చారని ద్వజమెత్తారు. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటి వేయకుండ, అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండ ఇష్టారాజ్యంగా 317 జీవో తీసుకొచ్చి సినియార్టీ, స్థానికత, మెడికల్ గ్రౌండ్, స్పౌజ్, విడో అంశాలను సక్రమంగా పరిగణలోకి తీసుకోకుండ చేస్తున్న బదిలీలతో రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి గందరగోళం, ఆయోమయంగా తయారై ఆందోళన బాట పట్టడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కారణమైందన్నారు. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే వారిని ఒకే చోట ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డయాబెటిక్ పిల్లలున్నా ఉద్యోగుల, ఉపాధ్యాయులను జిల్లా హెడ్ క్వార్టర్ లోనే పని చేసే అవకాశం కల్పించాలని లేకుంటే వైద్య పరంగా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 317 జీవో సవరించి స్థానికత ఆధారంగానే ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు భిన్నంగా సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటుందని, ఎవరు కూడ దిగులుపడొద్దని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు

Related posts

నన్ను అరెస్ట్ చేస్తే అమెరికాలో పెను విధ్వంసమే: ట్రంప్

Drukpadam

తెలంగాణాలో కమలం జోష్…

Drukpadam

ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్ర‌జ‌లు సాధించిన విజయం: ఈట‌ల రాజేంద‌ర్

Drukpadam

Leave a Comment