Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గత ఏడాది భారీగా పెరిగిన ప్రపంచ జనాభా.. భారత్ జనాభా ఎంతంటే…!

గత ఏడాది భారీగా పెరిగిన ప్రపంచ జనాభా.. భారత్ జనాభా ఎంతంటే…!
ప్రపంచం మొత్తం జనాభా 786.88 కోట్లు
గత ఏడాది 7.42 కోట్ల పెరుగుదల
అంతకుముందు ఏడాదితో పోలిస్తే 0.9% పెరుగుదల
భారత్ జనాభా 133.93 కోట్లు
139.78 కోట్లతో తొలి స్థానంలో చైనా
అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక

ప్రపంచ జనాభాలో గత ఏడాది భారీ పెరుగుదల నమోదైంది. అయితే, అంచనా వేసిన దానికన్నా పెరుగుదల తక్కువే ఉంది. మొత్తం జనాభాలో 0.96 శాతం పెరుగుదల నమోదవుతుందని అంచనా వేసినా.. 0.9 శాతమే నమోదైంది. ఈ మేరకు అమెరికా సెన్సస్ బ్యూరో గత ఏడాదికి సంబంధించిన జనాభా లెక్కలను నిన్న విడుదల చేసింది.

ఆ లెక్కల ప్రకారం, మొత్తంగా పోయినేడాది జనాభా 7,42,35,487 పెరిగిందని పేర్కొంది. దీంతో ప్రపంచ జనాభా 786 కోట్లుగా నమోదైందని వెల్లడించింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ జనాభా అక్షరాలా 786 కోట్ల 88 లక్షల 72 వేల 451 అని ప్రకటించింది. అమెరికా జనాభా 33 కోట్ల 24 లక్షల 3,650కి పెరిగిందని పేర్కొంది.

ఇక ప్రపంచంలో 139 కోట్ల 78 లక్షల 97,720 జనాభాతో చైనా ముందు వరుసలో ఉందని రిపోర్ట్ పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉందని వెల్లడించింది. మన దేశంలో జనాభా 133 కోట్ల 93 లక్షల 30 వేల 514గా ఉందని పేర్కొంది. ఆ తర్వాత మూడో స్థానంలో అమెరికా ఉంది. 27 కోట్ల 51 లక్షల 22 వేల 131 జనాభాతో ఇండోనేషియా నాలుగో స్థానంలో ఉండగా.. 23 కోట్ల 81 లక్షల 81 వేల 34 మందితో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది.

1960లో జనాభా పెరుగుదల అత్యధికంగా 2 శాతం నమోదు కాగా.. 2,100 నాటికి అదే స్థాయిలో జనాభా పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని సెన్సస్ బ్యూరో వెల్లడించింది. అయితే, ఆ తర్వాత జనాభా గణనీయంగా పడిపోతుందని పేర్కొంది. ఇప్పటికే ప్రపంచంలోని సగం దేశాల్లో ఓ కుటుంబానికి సగటున ఇద్దరు లేదా అంతకన్నా తక్కువ మంది పిల్లలే ఉంటున్నారని చెప్పింది. ఐక్యరాజ్య సమితి డేటా ప్రకారం 2,100 నాటికి కొన్ని దేశాల్లోనే జనాభా పెరుగుదల నమోదవుతుందని తెలిపింది.

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్, టాంజానియా, అమెరికా వంటి దేశాల్లోనే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో 55 దేశాల్లో జనాభా ఒక శాతం మేర తగ్గిపోతుందని వివరించింది. బల్గేరియా, లాట్వియా, లిథువేనియా, ఉక్రెయిన్ లలో అత్యధికంగా 20 శాతం మేర జనాభా తగ్గుతుందని పేర్కొంది. ఒకానొక దశలో ప్రపంచ జనాభాలో 18 నుంచి 24 ఏళ్ల యువత కన్నా 65 ఏళ్లపైబడిన వృద్ధులే ఎక్కువగా ఉంటారని తెలిపింది. అదే నిజమైతే 2,100 తర్వాత జనాభా క్రమంగా తగ్గుతుందని అంచనా వేసింది.

వాస్తవానికి ఇటీవల లాన్సెట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం జనాభా పెరుగుదల పతాక స్థాయికి 2064లోనే చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ఏడాదికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. ఆ తర్వాత 2,100 నాటికి జనాభా 880 కోట్లకు పడిపోతుందని పేర్కొంది. జపాన్, ఇటలీలపైనే ఆ ప్రభావం ఎక్కువగా పడుతుందని హెచ్చరించింది.

అలాగే, స్పెయిన్, పోర్చుగల్, థాయిలాండ్, సౌత్ కొరియాల్లో 50 శాతం మేర జనాభా పడిపోతుంది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉండే చైనాలో కూడా ఈ శతాబ్దం చివరి నాటికి జనాభా సగానికి పడిపోతుందని అంచనా వేస్తున్నారు. 2063లో బ్రిటన్ లో 7.5 కోట్లకు పెరుగుతుందని, 2100 నాటికి 7.1 కోట్లకు తగ్గుతుందని రిపోర్ట్ పేర్కొంది.

Related posts

స్కిల్ డవలప్మెంట్ కేసులో ఏ తప్పు జరగలేదు …నేను నిప్పునన్న చంద్రబాబు…!

Ram Narayana

ఫోన్ కోసం అధికారి శాడిజం …జీతంలో కోత

Drukpadam

భూముల పరిహారం పెంచాలంటే రైతులపై కేసులు …యూ పీ ప్రభుత్వ నిర్వాకం…

Drukpadam

Leave a Comment