Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మూడు రాజధానులు, తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై రేపు ప్రధాని మోదీతో జగన్ సమావేశం!

మూడు రాజధానులు, తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై రేపు ప్రధాని మోదీతో జగన్ సమావేశం!
-రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం
-హోం మంత్రి అమిత్ షాతోనూ భేటీ
-పోలవరం సవరణ అంశాలపై చర్చ

ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరేందుకు ఏపీ సీఎం జగన్ రేపు హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు . ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో సమావేశం కానున్నారు. మూడు రాజధానులు , తెలంగాణ ,ఏపీ మధ్య నెలకొన్న జలవవిధాలపై ప్రధాని మోడీతో సమావేశంలో ప్రస్తహించనున్నారు. అంతే కాకుండా పోలవరం ప్రాజక్టు కు నిధుల విషయంలో అంచనా వ్యయాలను కాకుండ తగ్గించి ఇవ్వడంపై రాష్ట్రప్రభుత్వ తరుపున ఇప్పటివరకు కేంద్రం వద్ద చెప్పిన అంశాలను వారినుంచి వచ్చిన సమాధానాన్ని ప్రధాని , హోమ్ మంత్రి అమిత్ షా కు వివరించనున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, విభజన హామీలతో పాటు మరికొన్ని కీలకాంశాలపై వారితో చర్చించనున్నారు. ఇప్పటికే వారిద్దరి అపాయింట్ మెంట్ ను జగన్ తీసుకున్నారని సమాచారం.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన వ్యయ అంచనాలు, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. మూడేళ్లుగా ఈ అంశంపై కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా సానుకూల నిర్ణయం మాత్రం రాలేదు. ఈ పర్యటనలోనైనా దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు, అమరావతి భవిష్యత్ పై మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.

రాజకీయ అంశాలు కూడా వారి భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర శాఖ వ్యవహారశైలి , భవిషత్ పరిణామాలు వారిమధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేశంలో ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు బీజేపీ కి దూరం అవుతున్న సందర్భంలో ఏపీ లో తెలుగు దేశంతో తిరిగి దోస్తీ కట్టే అవకాశాలు ,తెలంగాణ లో అధికార టీఆర్ యస్ ,బీజేపీ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో జగన్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది . మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రధాని మద్దతు కోరే అవకాశం ఉందని కూడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు .

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక బూటకం: కేజ్రీవాల్….

Drukpadam

తన పతనానికి సుపారీ ఇచ్చారన్న మోదీ… వాళ్ల పేర్లు చెప్పాలన్న కపిల్ సిబాల్…

Drukpadam

గవర్నర్ తన విశేష అధికారాలతో టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలి: రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment