Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమపార్టీకి లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి!

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమపార్టీకి లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి!
ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమన్న చంద్రబాబు
తాము ఐదేళ్లూ అధికారంలో ఉంటామన్న మిథున్ రెడ్డి
పార్టీని కాపాడుకునేందుకేనంటూ చంద్రబాబుపై విమర్శలు
తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు

ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు ఉవ్విళ్ళు ఊరుతున్న తరుణంలో వైసీపీ లోకసభ పక్షనేత మిథున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమపార్టీకి లేదని తమపార్టీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుందని అన్నారు. చంద్రబాబుకు అధికారం లేదని ముందస్తు ఎన్నికలు అంటూ పార్టీ క్యాడర్ ను కాపాడుకొనే పనిలో ఉన్నారని ఆయన ఎన్ని ఎత్తులు వేసిన టీడీపీ మరింత బలహీనపడటం ఖాయమని పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్రను కూడా టీడీపీ సరిగా పోషించలేకపోతుందని అందువల్ల వారి ఉనికికే ప్రమాదం ఏర్పడిన వేళా ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు పడరాని పట్లు పడుతున్నారని అన్నారు.

ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంపై వైసీపీ యువ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటూ తాము అధికారంలో ఉంటామని తెలిపారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ మిథున్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన తిరుపతిలోని ఓ హోటల్ రూపొందించిన యాప్ ను ఆవిష్కరించారు.

2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం తెలిసిందే. రాష్ట్రంలో మళ్లీ 2024లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపాలంటూ ప్రధాని మోదీ అభిలషిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Related posts

హుజూరాబాద్ టీఆర్ఎస్‌దే.. సర్వేలు మాకే అనుకూలం: కేసీఆర్!

Drukpadam

వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ఘనత కాంగ్రెస్ దే: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

Drukpadam

రోడ్ వేస్తానని మాటయిచ్చి తప్పిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి!

Drukpadam

Leave a Comment