Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉత్తరప్రదేశ్ లో క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ!

ఉత్తరప్రదేశ్ లో క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ!

  • మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి భూమిపూజ
  • మీరట్ జిల్లాలో ఏర్పాటు
  • రూ.700 కోట్లతో నిర్మాణం
  • అనేక క్రీడాంశాల్లో మెరుగైన బోధన, శిక్షణ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు. మీరట్ జిల్లాలో క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. హాకీ వీరుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరిట ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపిస్తున్నారు. ఇందులో వెయ్యికి పైగా క్రీడాకారులకు తర్ఫీదు ఇవ్వనున్నారు.

ఈ వర్సిటీలో హాకీ, కబడ్డీ, ఫుట్ బాల్, టెన్నిస్, వాలీబాల్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, సైక్లింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, కయాకింగ్, కనోయింగ్, షూటింగ్, ఆర్చరీ, స్క్వాష్ వంటి క్రీడాంశాల్లో మెరుగైన శిక్షణ ఉంటుంది. మీరట్ జిల్లాలోని సర్ధానా పట్టణ శివారు ప్రాంతంలో ఈ వర్సిటీ నిర్మిస్తున్నారు. ఈ వర్సిటీ నిర్మాణానికి రూ.700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

కాగా, ఈ వర్సిటీ శంకుస్థాపన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా ఉపకరణాల ప్రదర్శనను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు.

Related posts

సీఎల్పీ సమావేశం నుంచి జగ్గారెడ్డి వాక్ అవుట్ !

Drukpadam

వ్యాక్సిన్ పై ప్రధాని నిర్ణయం చారిత్రాత్మకం …పొంగులేటి సుధాకర్ రెడ్డి

Drukpadam

రాఖీరాజకీయం…చంద్రబాబు కు రాఖీకట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క!

Drukpadam

Leave a Comment