Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా!

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా!
-జ్వరం, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రేవంత్
-టెస్టుల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ
-తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచన

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. జ్వరం, స్వల్ప లక్షణాలు కనిపించడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, దీంతో కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

రేవంత్ రెడ్డి నిత్యం ఎదో కార్యక్రమంలో పాల్గొనటంతో అనేక ఏమండీ ఆయన్ని కలిశారు. ఎంతమందిని కలిశారో కూడా చెప్పటం కష్టం …అందువల్ల గతవారం పది రోజులుగా ఆయన్ని కలిసినవారు తమకు తాముగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏ మాత్రం అనుమానమున్న తగిన పరీక్షలు చేయించుకోవాలని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అయిన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. గద్దిరోజులపాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు తెలిపారు.

Related posts

2023 వరకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ బుకింగ్స్ ఫుల్… వెయిటింగ్ లిస్టులో భారత్!

Drukpadam

మాస్క్ త‌ప్ప‌నిస‌రి,.. లేకుంటే రూ.1,000 జ‌రిమానా!: తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్

Drukpadam

వచ్చే ఏడాది నాటికి కరోనా పీచమణిచే ఓరల్​ ఔషధం: ఫైజర్

Drukpadam

Leave a Comment