Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ లో వివాదంగా మరీనా వంగవీటి రాధా రెక్కీ వ్యవహారం…

ఏపీ లో వివాదంగా మరీనా వంగవీటి రాధా రెక్కీ వ్యవహారం…
-తనహత్యకు రెక్కీనిర్వహించారని రాధా స్వయంగా చెప్పారు
-చంద్రబాబు దీన్ని బలపరిచారు …రాధా ఇంటికి వెళ్లి విషయాలు తెలుసుకున్నారు
-దానిపై పోలీసులు విచారణ చేపట్టి …రెక్కీ నిర్వహించారనేది నిజం కాదని తేల్చారు
-వంగవీటి రాధా ఆఫీసు వద్ద రెక్కీ నిర్వహించింది వీరే నాని కేశినేని నాని బల్ల గుద్ది వాదించారు
-టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారే రెక్కీ నిర్వహించారు
-రాధాకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానన్నారు

విజయవాడ కు చెందిన వంగవీటి రాధాను హత్య చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీనిర్వహించారని రాధా స్వయంగా తెలపడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే 2 +2 భద్రతా కల్పిస్తున్నట్లు ప్రకటించి ఆయన భద్రతకోసం పంపింది . రాధా తనకు గన్మెన్ల భద్రతా అవసరంలేదని గన్ మెన్లను తిప్పిపంపారు. దీనిపై చంద్రబాబు భద్రతా కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన రాధా ఇంటికి స్వయంగా వెళ్లి రెక్కీ వ్యవహారాన్ని గురించి రాధను ఆడికి తెలుసుకున్నారు. రెక్కీ కోసం కారు వచ్చిందని ఆ కారు ఎవరిదో చెప్పాలని చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో రంగంలో దిగిన విజయవాడ పోలీసులు విచారణ జరిపి రాధపై ఎవరు రెక్కీనిర్వహించలేదని తమ విచారణలో తేలిందని ,రాధా భద్రతా మా భాద్యత అని విజయవాడ సిపి క్రాంతిరానా టాటా మీడియా సమావేశంలో తెలిపారు . అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని రెక్కీ నిర్వహించింది వాస్తవమేనని వారే ఎవరో కూడా తెలుసునని అన్నారు.

దివంగత ఎన్టీఆర్, చంద్రబాబు ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని కేశినేని నాని అన్నారు. టీడీపీ నేత పట్టాభి ఇంటిపైనా, టీడీపీ ఆఫీసుపైనా దాడి చేసిన వారే వంగవీటి రాధా కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించారని చెప్పారు. ఈరోజు వంగవీటి రాధా ఇంటికి కేశినేని నాని, నెట్టెం రఘురాం వెళ్లారు. రెక్కీకి సంబంధించిన వివరాలను ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి కుటుంబం రాష్ట్రానికి ఒక సంపద అని చెప్పారు. వంగవీటి రాధా జాగ్రత్తగా ఉండాలని కేశినేని సూచించారు. రెక్కీ విషయాన్ని పోలీసులు సీనియస్ గా తీసుకోవాలని కోరారు. విజయవాడలో పాత రోజులు రాకుండా పోలీసులు శాంతిభద్రతలను కాపాడాలని అన్నారు. రాధా రక్షణ కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని తెలిపారు. వంగవీటి కుటుంబానికి అనుచరులుగా నటిస్తున్న కొందరు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని నాని ఆరోపించారు.

Related posts

ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రేసులో న‌ఖ్వీ? కేంద్రమంత్రి పదవికి రాజీనామా!

Drukpadam

2.8 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన అఖిలేశ్ యాదవ్ అర్ధాంగి డింపుల్!

Drukpadam

ముగిసిన బెంగాల్ ఎన్నికలు … చివర విడతలోనూ 76 ,07 శాతం పోలింగ్

Drukpadam

Leave a Comment