Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం.. 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన ప్రధాని..

మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం.. 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన ప్రధాని..
-ప్రధాని అసహనం …మీ సీఎం కు థాంక్స్ అని అధికారులతో అన్న ప్రధాని
-జాతీయ అమరవీరుల స్మారకం ఉన్న హుస్సేనివాలకు వెళ్లాల్సిన ప్రధాని
-రోడ్డును నిర్బంధించిన నిరసనకారులు
-తిరిగి ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయిన మోదీ కాన్వాయ్
-భద్రతా వైఫల్యాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ
-పూర్తి నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశం

భారత ప్రధాని మోదీకి కనీవినీ ఎరుగని భద్రత ఉంటుంది. ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్లినా వేలాది మంది సాయుధబలగాలు ఆయనకు భద్రత కల్పిస్తుంటాయి. అయితే ఈరోజు ఆయన పంజాబ్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపించింది. ఆయన ప్రయాణిస్తున్న సమయంలో నిరసనకారులు రోడ్డును నిర్బంధించారు. దీంతో మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ పై 15 నుంచి 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దాంతో మోదీ అక్కడే కారులో ఉండిపోయారు. ఆ తర్వాత మోదీ కాన్వాయ్ తిరిగి వెనక్కి వెళ్లిపోయింది.

ఈ భద్రతా వైఫల్యాన్ని కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై తక్షణమే నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, పంజాబ్ లోని జాతీయ అమరవీరుల స్మారకం ఉన్న హుస్సేనివాలకు మోదీ వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలోని ఫ్లైఓవర్ వరకు ప్రధాని కాన్వాయ్ చేరుకుంది.

అయితే మోదీ కాన్వాయ్ ను అక్కడ నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మోదీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే కాన్వాయ్ ని ఆపేశారు. దీంతో ఫ్లైఓవర్ పై కారులోనే మోదీ వుండిపోయారు. ఇది ప్రధాని భద్రతకు సంబంధించి అతిపెద్ద వైఫల్యమని కేంద్ర హోంశాఖ వ్యాఖ్యానించింది.

వాతావరణం సరిగా లేని కారణం వల్ల జాతీయ అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లే ప్రయాణానికి సంబంధించిన ప్లాన్ లో మార్పులు చేశామని… రోడ్డు మార్గం గుండా అక్కడకు వెళ్లేందుకు ప్లాన్ మారిందని… అది 2 గంటల రోడ్డు ప్రయాణమని కేంద్ర హోంశాఖ తెలిపింది.

భద్రతా ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయంటూ పంజాబ్ డీజీపీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ప్రధాని కాన్వాయ్ బయల్దేరిందని చెప్పింది. రోడ్డు మార్గంలో ప్రధాని ప్రయాణిస్తున్నారని తెలిసినా పంజాబ్ ప్రభుత్వం అదనపు సెక్యూరిటీ ఏర్పాట్లను చేయలేదని తెలిపింది. ప్రయాణానికి విఘాతం కలిగిన నేపథ్యంలో మోదీ కాన్వాయ్ భటిండా ఎయిర్ పోర్టుకు తిరిగి వచ్చిందని వెల్లడించింది.

ఈ భద్రతా వైఫల్యాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని… పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించామని పేర్కొంది. తప్పిదం ఎక్కడ జరిగిందో గుర్తించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపింది. మరోవైపు ఫిరోజ్ పూర్ లో జరగాల్సిన ప్రధాని ర్యాలీ కూడా రద్దయింది. వాతావరణ కారణాల వల్ల ర్యాలీ రద్దయినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించడం గమనార్హం.

ఎయిర్ పోర్టుకు ప్రాణాలతో రాగలిగా.. మీ సీఎంకు థ్యాంక్స్: పంజాబ్ అధికారులతో మోదీ

ప్రధాని పంజాబ్ పర్యట నిరసనల మధ్య కొనసాగింది…దీంతో ఆయన ఫిరోజ్ పూర్ వెళ్లాల్సిన పర్యటన రద్దు చేసుకున్నారు. అంతకుముందు ఆయన భటిండా పర్యటనలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఫిరోజ్ పూర్ వెళ్లాల్సి ఉంది. ఫిరోజ్ పూర్ వెళ్లేందుకు భటిండా నగరంలోని ఫ్లైఓవర్ పైకి ప్రధాని కాన్వాయ్ వెళ్ళగానే అకస్మాత్తుగా నిరసన కారులు ఫ్లైఓవర్ పైన ప్రధాని కాన్వాయ్ కి అడ్డాగా బైఠాయించారు. ఫలితంగా ప్రధాని ఫ్లై ఓవర్ పైనే 20 నిమిషాలు ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడినుంచి ముందుకు పోవడం కుదరక ఫిరోజ్ పూర్ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని భటిండా ఎయిర్ పోర్ట్ కు చేరుకొని ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ పోలీస్ అధికారులతో ఎయిర్ పోర్ట్ కు ప్రాణాలతో రాగలిగా మీ సీఎంకు థ్యాంక్స్’ అని అన్నారు. కాగా కేంద్ర హోమ్ శాఖ ఈ పరిణామాలపై సీరియస్ అయింది. ప్రధాని భద్రతా వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులను కోరింది.

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ పై దాదాపు 20 నిమిషాల సేపు నిలిచిపోయింది. నిరసనకారులు రోడ్డును నిర్బంధించడంతో మోదీ ఫ్లైఓవర్ పైనే ఆగిపోయారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇది అతి పెద్ద భద్రతా లోపమని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు ఘటన జరిగిన ప్రదేశం నుంచి భతిండా ఎయిర్ పోర్టుకు మోదీ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద ఉన్న రాష్ట్ర అధికారులతో ఆయన మాట్లాడుతూ, ‘భటిండా ఎయిర్ పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్’ అని అన్నారు. మరోవైపు ఈ ఘటన వల్ల ప్రధాని మోదీ ఫిరోజ్ పూర్ ర్యాలీ రద్దయింది.

ప్రధాని భద్రతా లో వైఫల్యం ఉందని అది రాష్ట్రప్రభుత్వం వైఫల్యమేనని కేంద్రం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం . అయితే కేంద్ర నిఘా వర్గాలు ఏమి చేస్తున్నాయి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ ప్రధాని రోడ్ మార్గం ద్వారా కాకుండా హెలికాఫ్టర్ లో వెళ్ళాల్సింది అంటున్నారు.

Related posts

సాగు చట్టాలు బాగు బాగు …. ప్రతిపక్షాలదే తప్పుడు ప్రచారం బీజేపీ ఎంపీ జీవీఎల్…

Drukpadam

గజ్వేల్‌కు ఎట్ల వస్తవో అంటివి కదా కేసీఆర్.. ఇప్పుడు కనిపించిందా బొమ్మ: సీతక్క!

Drukpadam

రాష్ట్రపతి పాలన విధించాలని కోరడానికి కారణం ఇదే: చంద్రబాబు!

Drukpadam

Leave a Comment