Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వనమా రాఘవేంద్రరావు అరెస్ట్..? బెయిల్ రాకుండా కౌంటర్ వేస్తాం: పోలీసులు!

వనమా రాఘవేంద్రరావు అరెస్ట్..? బెయిల్ రాకుండా కౌంటర్ వేస్తాం: పోలీసులు!
రాఘవను నియోజవర్గంలో కాలుమోపనివ్వనన్న ఎమ్మెల్యే వనమా
తన నిర్దోషిత్వం నిరూపించుకునేంతవరకు నియోజకవర్గానికి దూరంగా ఉంటాడని వెల్లడి
పోలీసులకు లోగిపోయి విచారణకు సహకరిస్తాడన్న వనమా
అధికారమదంతో ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నాడన్న సీఎల్పీ నేత భట్టి
వనమా నైతిక భాద్యత వహించాలి… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్
రాఘవ వ్యవహారంలో అధికార యంత్రాంగం సాచివేత వైఖరిపై ధ్వజం

కొత్తగూడెం నియోజకవర్గంలోని పాతపాల్వంచలో జరిగిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు టీఆర్ యస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ ఒక కుటుంబంపై దుర్మార్గంగా వ్యవహరించినతీరు కుటుంబంలోని తల్లి నలుగురు ఆత్మహత్యకు దారితీసింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,పీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ లు రాఘవ విషయంలో ప్రభుత్వ చర్యలను తూర్పార భట్టారు. ఈరోజు హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అధికార మదంతోనే ఎమ్మెల్యే కుమారుడు రాఘవ ఒక కుటుంబంలోని నలుగురు హత్యకు కారణమైయ్యారని దుయ్యబట్టారు . ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్యే అని అందువల్ల రాఘవ పై హత్యే నేరం మోపి అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. వనమా దీనికి నైతిక భాద్యత విహించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు .

కొద్దిసేపటికే ఎమ్మెల్యే వనమా ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. తన కుమారుడు పోలీసులకు లొంగి పోయి దర్యాప్తుకు సహకరిస్తాడని . తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంతవరకు నియోజకవర్గ విషయాల్లో జోక్యం చేసుకోడని, అసలు నియోజకవర్గంలో కాలు మోపడని ఆ లేఖలో పేర్కొన్నారు. అనంతరం కొద్దీ సేపటికి ఆయన లొంగి పోవడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు పాల్వంచ లోని వనమా ఇంటిముందు ధర్నా చేశారు .

ఆత్మహత్య చేసుకునే ముందు రామకృష్ణ సెల్పీ వీడియో తీసి.. అందులో వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు పేరును ప్రస్తావించారు. ఆయన వల్లే తాము సూసైడ్ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సెల్ఫీ వీడియో వైరల్ కాగా.. ప్రభుత్వం కూడా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్ర రావును అరెస్ట్ చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవేంద్ర రావు కారణమని ఆరోపిస్తూ బాధితుడు తీసిన సెల్ఫీ వీడియో ట్రోల్ అవుతుంది. రాజకీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే కొడుకు నీచానికి పాల్పడుతాడా? అంటూ ఎమ్మెల్యే రాజీనామాకు కూడా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రతిప‌క్షాలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేశారు.

వనమా రాఘవేంద్ర రావుపై 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెయిల్‌కు అప్లై చేసినా కూడా రాకుండా కౌంటర్ దాఖలు చేస్తామని అంటున్నారు. రాఘవ తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కూడా తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఎలాంటి విచారణకైనా సహకరిస్తామని స్పష్టం చేశారు.

మీ సేవ నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీవీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో రామకృష్ణ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతం అయ్యాడు. ఏ భర్త కూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు

తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితోపాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన సోదరుడు, అక్క కూడా ఇబ్బందిపెట్టారని చెప్పారు. వనమా.. తన భార్యను హైదరాబాద్‌ తీసుకొస్తేనే సమస్యను పరిష్కారిస్తానని నీచంగా మాట్లాడాడు. వీరివల్ల మానసికంగా కృంగిపోయి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు.

Related posts

హైదరాబాద్‌లో భారీ చోరీ..నగదు జోలికి వెళ్లని దొంగలు!

Drukpadam

సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ ల కలకలం!

Drukpadam

ఘోరం.. అపహరణకు గురైన భారత సిక్కు కుటుంబం హత్య!

Drukpadam

Leave a Comment