కటకటాల్లోకి కీచక రాఘవ… 14 రోజుల రిమాండ్!
వనమా రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య
ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవపై ఆరోపణలు
ఏపీ వైపు పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరు
పాల్వంచలోని ఒక కుటుంబం తల్లినలుగురు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులకు ప్రధాన భాద్యడుగా పేర్కొంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా రాఘవ పై ఆరోపణలలు రావడం తెలిసిందే . దీనిపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున స్పందించి పాల్వంచ కొత్తగూడెం బండ్ నిర్వహించిన నేపథ్యంలో ఎట్టకేలకు రాఘవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన తొలుత పోలీసులు ప్రశ్నించిన అనంతరం కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ రాఘవకు 14 జుడీసిల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు కటకటాల్లోకి పంపించారు. దీనిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఆయనపై నిజంగా బలంగా ఛార్జ్ షీట్ నమోదు చేస్తారా ? లేదా అంటున్నారు. ఆయన ఇక బయటకు రాకుండా ఉండేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు .
పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారకుడంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. రాఘవను ప్రాథమికంగా విచారించిన అనంతరం పోలీసులు కొత్తగూడెంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో అతనికి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతనిని భద్రాచలం జైలుకు తరలించారు. కాగా, రామకృష్ణను బెదిరించినట్టు రాఘవ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.
గతంలో అతడిపై 11 కేసులు ఉన్నట్టు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. తాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాఘవతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు.
కాగా, తన కుమారుడిపై ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాయడం తెలిసిందే. తన కుమారుడు పోలీసు విచారణకు సహకరించేలా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.