కరోనా భయం పెళ్లిళ్ల వాయిదా …ప్రయాణాలు వాయిదా ,సభలు సమావేశాలు రద్దు!
-హైదరాబాద్ లో వాయిదా పడుతున్న పెళ్ళిళ్లు, ప్రదర్శనలు, సభలు
-హైటెక్స్ లో కార్యక్రమాలు వాయిదా
-బాంక్వెట్ హాళ్లు కూడా ఖాళీ
-ఘనంగా వివాహం చేసుకున్నా అతిథుల కరవు
-నలుగురితోనే పూర్తి చేసే ధోరణి
కరోనా మరోసారి వాయివేగంతో విజృంభిస్తుంది…ఒకటికాదు రెండుకాదు ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య 30 కోట్లకు పైమాటే …చిన్నాపెద్దా ,ధనిక ,పేద దేశాలతో సంబంధం లేదు …అన్నిదేశాల్లో కరోనా వైరస్ దావానంలా వ్యాపించింది….దీనికి మందు ఒక్కటే మూడు జాగ్రత్తలు అంటున్నారు నిపుణులు …మాస్క్ లు పెట్టుకోవడం ,శానిటైజర్ ఉపయోగించడం అని నిష్కర్షగా చెబుతున్నారు. పాటించిన వాళ్ళ బాగేనే ఉంటున్నారని .పాటించకపోతే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని సర్వే లో తేలింది.అమెరికా , ఫ్రాన్స్ , బ్రిటన్ , బ్రెజిల్ లాంటి దేశాల్లో రోజురోజు కు కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వైరస్ ఆగటంలేదు . అయితే మోర్టాలిటీ రేటు తక్కువగా ఉండి వారు త్వరగా కోలుకుంటున్నారు. ఇప్పుడు బాస్టర్ డోస్ అంటే మూడవ వ్యాక్సిన్ తీసుకోవని అంటున్నారు.కొన్ని దేశాల్లో బాస్టర్ డోస్ ఇస్తున్నారు . ఈ దెబ్బతో అనేక కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. మళ్ళీ లాక్ డౌన్ వస్తుందేమో అని సందేహం ప్రజలను వెంటాడుతుంది.
ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్ లో పెళ్ళిళ్లు, ప్రదర్శనలు (ఎగ్జిబిషన్లు), సభలు, సమావేశాలు వాయిదా పడుతున్నాయి. కొన్ని రద్దవుతుంటే, కొన్నింటిని వాయిదా వేసుకుంటున్నారు.
ఎగ్జిబిషన్లు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలోనే నడుస్తుంటాయి. ఏటా 100 వరకు పెద్ద కార్యక్రమాలకు హైదరాబాద్ వేదికగా నిలుస్తుంటుంది. కానీ కరోనాతో గత రెండేళ్లు ఈ మార్కెట్ దెబ్బతిన్నది.
హైటెక్ సిటీ వద్దనున్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ప్రముఖమైనది. ‘‘జనవరి నెలకు సంబంధించి ఇప్పటికే ఐదు కార్యక్రమాలు రద్దయ్యాయి. ఈ నెలలోనే జరగాల్సిన మరో నాలుగు కార్యక్రమాలపై అనిశ్చితి నెలకొంది’’అని హైటెక్స్ ఎగ్జిబిషన్ యాజమాన్యం పేర్కొంది.
బాంక్వెట్ హాళ్లు, హోటళ్లలో పెద్ద ఎత్తున వేడుకలు, ప్రదర్శనలు నడుస్తుంటాయి. ఎక్కువ కార్యక్రమాలకు ఇవే వేదికలుగా ఉంటాయి. కానీ కేసులు పెరుగుతుండడంతో ఇటీవల కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారని, వాయిదా పడుతున్నాయని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అంటోంది.
ఘనంగా పెళ్ళి వేడుకలు నిర్వహిద్దామనుకున్న వారు కూడా సింపుల్ గా కానిచ్చేదామనే ఆలోచనకు వస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున అతిథులను పిలిచినా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పరిమిత అతిథులకు ఆహ్వానం పంపుతున్నారు.
కరోనా కేసులు పెరిగిపోవడంతో పిలిచినా ఇంటిల్లిపాదీ వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. దీంతో అనవసర ఖర్చు ఎందుకన్న భావనతో ఘనమైన వేడుకలను రద్దు చేసుకుని, కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు పది మంది సమక్షంలోనే వివాహం జరిపించేద్దామన్న ధోరణి కూడా కనిపిస్తోంది.