తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమ సహకరించలేదు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
-2009 లో చిరంజీవి వల్లనే ఓటమి పాలైయ్యా
-తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని వెల్లడి
-సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా అదే తంతు అని వివరణ
-టికెట్ల అంశంలో తమనెందుకు లాగుతున్నారని ఆగ్రహం
ఏపీలో సినిమా టికెట్స్ ధరల పెంపుడు విషయంలో ప్రభుత్వానికి సినీపరిశ్రమకు మధ్య యుద్ధం నడుస్తున్నది . పవన్ కళ్యాణ్ తో మొదలైన విమర్శలు , సిద్దార్థ్ , నాని లాంటి వారు ఏపీ ప్రభుత్వ వైఖరిపై విరుచుకపడ్డారు . దీంతో నిర్మాతల మండలి రంగంలోకి దిగింది. ఒక సందర్భంలో చిరంజీవి కూడా వస్తారని ప్రచారం జరిగింది. మోహన్ బాబు ప్రయత్నాలు చేశారు. రామ్ గోపాల్ వర్మ ,ఎలా అనేక మంది ఏపీ ప్రభుత్వం తో రాజీకి ప్రయత్నించారు. టీడీపీ ,బీజేపీ ,జనసేన లాంటి పార్టీలు టికెట్స్ రేట్లు పెంచడానికి అంగీకరించాయనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు చిత్రపరిశ్రమ ఎప్పడు సహకరించలేదని పరోక్షంగా తన ఓటిమికి ఒక సందర్భంలో చిరంజీవి కారణమైయ్యారని ఆరోపించారు. అయిన ఆయన తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని తెలిపారు. సినీ పరిశ్రమకు రాజకీయాలు ఆపాదించడమే పెద్ద తప్పు అందులో చిరంజీవి సినీ పరిశ్రమ నుంచి పోటీకి దిగలేదు. పైగా సినీ పరిశ్రమ అంతా ఆయన పార్టీలో చేరలేదు . మరి చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయనేత ఎందుకు ఎలా అంటున్నారని సినీ పెద్దల సందేహం ….
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సినిమా టికెట్ల అంశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమ సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు వచ్చాయని ఆరోపించారు. అయితే, వైసీపీ నేతలు తమను సినిమా టికెట్ల వివాదంలోకి లాగుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కారణంగా తమకు విజయం దూరమైందని విశ్లేషించారు. చిరంజీవి పార్టీ పెట్టకపోతే తామే గెలిచేవాళ్లమని అన్నారు. అయితే, చిరంజీవితో అప్పుడు, ఇప్పుడు తనకు సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు.