Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారో చర్చకు సిద్ధమా?: ఏపీ నేతలకు తమ్మారెడ్డి భరద్వాజ సవాల్!

మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారో చర్చకు సిద్ధమా?: ఏపీ నేతలకు తమ్మారెడ్డి భరద్వాజ సవాల్
బలిసి కొట్టుకుంటున్నది మీరే.. సినిమా వాళ్లు కాదు!: వైసీపీ ఎమ్మెల్యేపై ఎన్వీ ప్రసాద్ ఫైర్
కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు?
మేమేమీ మీలాగా రూపాయి పెట్టి కోట్లు తినట్లేదు
సినీ పరిశ్రమపై నిందలు వేసిన వారు తలలు దించుకోవాలంటూ కామెంట్
సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారన్న నల్లపురెడ్డి
అనవసర వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చుకోవద్దన్న ఎన్వీ ప్రసాద్
మీడియా ముందు మాట్లాడినంత మాత్రాన హీరో అయిపోరని మండిపాటు

ఏపీలో సినిమా టికెట్స్ ధరలపెంపుదల వివాదం రోజురోజుకు అటు ప్రభుత్వానికి ఇటు సినీప్రశ్రమకు మధ్య గ్యాప్ పెరిగేలా చేస్తుంది.వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారనే మాట పై సినీ ప్రరిశ్రమ భగ్గుమన్నది. బలిసికొట్టుకుంటున్నది మేము కాదు మీరేనంటూ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఫైర్ అయ్యారు. అనవసర మాటలద్వారా మీకుటుంబానికి ఉన్న గౌరవాన్ని దిగజార్చుకోకండి. అని హితవు పలికారు . మరో నిర్మాత మీడియా సమావేశం పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలపై విరుచుకపడ్డారు . మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారో చర్చకు సిద్ధమా అని ధ్వజమెత్తారు . కులాల ప్రస్తావన తీసుకురడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కుల ప్రస్తావన లేకుండా అందరికి ఉపాధి కల్పిస్తున్న ఏకైక సంస్థ సినీ పరిశ్రమనేనని అన్నారు .

సినీ పరిశ్రమపై ఏపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఇవాళ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కుల ప్రస్తావన లేకుండా అందరికీ ఉపాధి కల్పిస్తున్న ఏకైక రంగం సినీ పరిశ్రమేనని, అలాంటి పరిశ్రమపై నిందలు వేసిన నాయకులు తలలు దించుకోవాలని ఆయన మండిపడ్డారు. సినిమా విషయంలో కులాలు, మతాలు ఎందుకంటూ ప్రశ్నించారు.

‘‘పుష్ప నిర్మాతలు ఫలానా కులానికి చెందిన వారు కాబట్టే.. ఇంకో కులానికి చెందిన వారిని ఆ సినిమాలో తిట్టారని చాలామంది విమర్శిస్తున్నారు. గతంలో కొందరు నేతలు ఇలాగే రెచ్చిపోయి మాట్లాడారు. వాళ్లు గడ్డితిన్నారని.. మీరూ గడ్డి తింటారా? మీకు ఒక కులపు వారు ఓట్లేస్తేనే గెలవలేదు. అన్ని వర్గాల వాళ్లు వేస్తేనే గెలిచారు. ఇష్టమొచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు. సినిమా వాళ్లు అంత లోకువ అయిపోయారా?’’ అంటూ ప్రశ్నించారు.

మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా? అని నిలదీశారు. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆస్తులెన్ని? ఇప్పుడెన్ని? అని ప్రశ్నించారు. వందల మంది కష్టపడితే వచ్చే ప్రాజెక్టు సినిమా అని అన్నారు. తామేమీ రాజకీయ నాయకుల్లాగా రూపాయి పెట్టి కోట్లు తినట్లేదన్నారు.

బలిసి కొట్టుకుంటున్నది మీరే.. సినిమా వాళ్లు కాదు: ఎన్వీ ప్రసాద్ ఫైర్

సినిమా టికెట్ల ధరను ఏపీ ప్రభుత్వం తగ్గించిన వ్యవహారం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న జరిపిన భేటీ కూడా ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి భోజనం చేసి వచ్చాడంటూ వర్మను పలువురు విమర్శిస్తున్నారు. మరో సినీ దర్శకుడు హరీశ్ శంకర్… వర్మపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. క్యాచ్ ఔట్ అయిన తర్వాత నేరుగా పెవిలియన్ లోకి వెళ్లి కూర్చోవాలని… గ్రౌండ్ లో డిబేట్ పెట్టొద్దని ఎద్దేవా చేశారు.

మరో వైపు పేర్ని నానితో వర్మ భేటీ అయిన సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డిపై సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మండిపడ్డారు. కొవ్వూరులో నల్లపురెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. నల్లపురెడ్డి కుటుంబం అంటే అందరికీ చాలా గౌరవం ఉందని… అనవసర వ్యాఖ్యలతో కుటుంబ గౌరవాన్ని దిగజార్చుకోవద్దని ఆయన అన్నారు.

మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన హీరో అయిపోరని ఎన్వీ ప్రసాద్ చెప్పారు. బలిసి కొట్టుకుంటున్నది సినిమా వాళ్లు కాదని… మీరేనని అన్నారు. సినిమా వాళ్లను అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదని అన్నారు. సినిమా నిర్మాణం ఎంత కష్టతరమో వచ్చి ప్రత్యక్షంగా చూడాలని చెప్పారు. తన సినిమా నిర్మాణ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తానని తెలిపారు. చేసిన వ్యాఖ్యలను ప్రసన్న వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

బ్యాలెట్ విధానంలోనే ‘మా’ ఎన్నికలు…

Drukpadam

నాకు, సమంతకు ఎఫైర్ ఉందని ప్ర‌చారం జ‌రుగుతోంది.. నాగచైతన్య ఎందుకు స్పందించడం లేదు?: ప్రీతం!

Drukpadam

25 భాషల్లో లాంచ్ అయిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్!

Drukpadam

Leave a Comment