Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెద్ది రెడ్డి ,రఘురామ కృషంరాజుల మధ్య మాటల యుద్ధం

-పెద్ది రెడ్డి ,రఘురామ కృషంరాజుల మధ్య మాటల యుద్ధం
-నా కాళ్లు పట్టుకుని బతిమాలితేనే వైసీపీలో చేరాను: రఘురామ కృష్ణరాజు
-పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నా
-అంతకంటే ముందు నా సవాలును స్వీకరించాలి
-చంద్రబాబు నాకు ఉన్నతస్థానం ఇచ్చారు
-దమ్ము ఉంటె రాజీనామా చేసు గెలువు-పెద్దిరెడ్డి
-ఎవరికోసమో మాట్లాడటం మానుకోవాలి
-ముఖ్యమంత్రి పైన , పార్టీపైనా అవాకులు చవాకులు మానుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , నర్సాపురం ఎంపీ అసమ్మతినేత రఘురామ కృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం ఆశక్తికరంగా మారింది. రఘురామకృషంరాజు చేతనైతే ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీచేయాలని సవాల్ విసిరారు మంత్రి పెద్ది రెడ్డి .పార్టీని ప్రభుత్వాన్ని , ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బందులు పెట్టేలా ప్రకటనలు చేయడంపై ఆయన మండి పడ్డారు. గెలిచినా పార్టీ బురద చల్లడం ఎవరి పెప్పుకోసమో నిరంతరం మాట్లాడటం ఇదా నీ నీతి అని అన్నారు. పార్టీ టికెట్ పై గెలిచి పార్టీనే ఇబ్బందులు పెట్టాలని చూడటం నైతికత అవుతుందా ? అని ప్రశ్నించారు.-ముఖ్యమంత్రి పైన , పార్టీపైనా అవాకులు చవాకులు మానుకోవాలి అని అన్నారు
దీనిపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందిస్తుం తన కాళ్లు పట్టుకుని బతిమాలితేనే తాను వైసీపీలో చేరానని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్టు చెప్పిన ఆయన.. తాను రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలిస్తే , జగన్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ పోటీకి దిగాలని, తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని అన్నారు. పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నా తాను విసిరే ఈ సవాలును కూడా స్వీకరించాలని కోరారు. ‘నేను కనుక సీఎం అయితే’ అన్న మాటల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీ సీఎం అసమర్థుడు, చేతకానివాడు అనేదే ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశమా? అని ప్రశ్నించారు. తాను చంద్రబాబుకు బంట్రోతుగా ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా చంద్రబాబు తనకు ఉన్నత స్థానం ఇచ్చారని రఘురామ అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీది కాదని తెలుసుకోవాలని హితవు పలికారు. తానెప్పుడూ సీఎం జగన్‌ను విమర్శించలేదని, ఆయన ప్రభుత్వ విధానాలను, తప్పు చేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని అన్నారు. జగన్‌, మిథున్‌రెడ్డిల దయవల్లే పెద్దిరెడ్డి మంత్రి అయ్యారని, ఇసుక ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావో అందరికీ తెలుసని పెద్దిరెడ్డిపై రఘురామ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీరి మధ్య జరుగుతున్నా మాటల యుద్ధం చర్చనీయాంశం అయింది .

Related posts

బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించలేను: శరద్ పవార్ స్పష్టీకరణ!

Drukpadam

కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే సరేసరి లేకపోతె యుద్ధం ఆగదు : వైఎస్ ష‌ర్మిల‌…

Drukpadam

ఎపి ప్రభుత్వానికి చివరి అవకాశంగా సుప్రీంకోర్టు వైపు చూపు?

Drukpadam

Leave a Comment