గోరఖ్ పూర్ అర్బన్ అసెంబ్లీ నుంచి సీఎం యోగిఅదిత్యానాథ్ పోటీ !
-యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
-యూపీలో ఎన్నికల సందడి
-ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు
-మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు
-తొలి రెండు విడతల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున సీఎం యోగిఅదిత్యానాథ్ పోటీ చేస్తారా ? లేదా ? అనే మీమాంశకు తెరదించుతూ బీజేపీ తన తొలిజాబితాను ప్రకటించింది. యోగి గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు . ఎస్పీ నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న అఖిలేష్ , బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. వీరు ఎన్నికల ప్రచారం వ్యూహాలతో తీరికలేకుండా ఉన్నందున పోటీచేయడంలేదని ఆయా పార్టీలు ప్రకటించాయి. బీజేపీ కి వరస ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో తగ్గుతున్న పట్టును నిలుపుకునేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుంది. అందులో భాగంగా సీఎం యోగిని బరిలో నింపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు బీజేపీకి గుడ్ బై చెప్పగా మరికొందరు అందుకు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ ప్రచారం చేస్తుంది. బీజేపీ కూడా ఇందుకు ప్రతివ్యూహాలు పన్నుతూ విపక్షాలనుంచి పలువురిని తమపార్టీ లో చేర్చుకునేందుకు ఆకర్ష్ మంత్రం ప్రయోగిస్తోంది. బీజేపీ లో కూడా కొందరు ఎమ్మెల్యేలు చేరారు . తన మొదటి జాబితా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ యోగి పేరు ప్రకటించడం విశేషం .
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత పెరిగింది. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. తాజాగా తొలి జాబితా విడుదల చేసింది. 1, 2వ విడతల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసే స్థానాన్ని కూడా నేడు ప్రకటించారు. ఆయన ఈ పర్యాయం గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. సీఎం పోటీ చేస్తున్న గోరఖ్ పూర్ అర్బన్ స్థానానికి ఆరో దశలో ఎన్నిక (మార్చి 3) జరగనుంది.