Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నరసారావు పేటలో టీడీపీ నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన…

నరసారావు పేటలో టీడీపీ నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన…
-ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ ను పరామర్శించిన టీడీపీ నేతలు
-జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటన
-ఇద్దరు టీడీపీ కార్యకర్తల అరెస్ట్
-వారిని విడుదల చేయాలంటూ అరవింద్ ఆధ్వర్యంలో ధర్నా
-తోపులాటలో అరవింద్ కు గాయాలు
-నరసరావుపేటలో టీడీపీ నేతల ర్యాలీ

గుంటూరు జిల్లా నరసరరావు పేట లో టీడీపీ కార్యకర్తలకు …పోలీసులకు మధ్య తోపులాటలో టీడీపీ నరసరరావు పేట ఇంచార్జి అరవింద్ కు గాయాలయ్యాయి. జొన్నలగడ్డలో వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు . వారిని విడుదల చేయాలనీ కోరుతూ టీడీపీ నేత అరవింద్ ఆధ్వరంలో పోలీస్ స్టేషన్ నిరసన తెలిపారు . నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డగించారు. ఈసందర్భంగా తోపులాట జరిగింది. తోపులాటలో అరవింద్ కు గాయాలయ్యాయి. దీనిపై టీడీపీ శ్రేణులు నరసరావుపేట చేరుకొని నల్ల కండువాలతో నిరసన తెలిపాయి.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటన, తదుపరి పరిణామాల నేపథ్యంలో నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు గాయాలవడం తెలిసిందే.

విగ్రహ ధ్వంసం ఘటనలో పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయగా, వారిని వదిలిపెట్టాలంటూ అరవింద్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగ్గా, అరవింద్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ ను టీడీపీ నేతలు నేడు పరామర్శించారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, జవహర్, మాజీ ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్ కుమార్, జీవీ ఆంజనేయులు తదిరులు నరసరావుపేటలో ర్యాలీ నిర్వహించారు. నల్ల కండువాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీపీ కార్యకర్తల అరెస్ట్ అక్రమం అని, వారిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది.

Related posts

మోదీకి దమ్ముంటే యడియూరప్పపై విచారణ జరిపించాలి: సిద్ధరామయ్య!

Drukpadam

కొడాలి నాని వ్యాఖ్యలపై గుడివాడలో ఉద్రిక్తత…

Drukpadam

కొత్త జిల్లాలను వసతులు, సదుపాయాలు లేకుండా ఏర్పాటు చేస్తే ఎలా?: జీవీఎల్ మెలిక!

Drukpadam

Leave a Comment