Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమెరికాలో మహిళా ఉగ్రవాది విడుదల కోసం నలుగురిని బందీలుగా చేసుకున్న దుండగుడు!

అమెరికాలో మహిళా ఉగ్రవాది విడుదల కోసం నలుగురిని బందీలుగా చేసుకున్న దుండగుడు!
-అల్ ఖైదా ఉగ్రవాదిగా ముద్రపడిన ఆఫియా సిద్ధిఖీ
-అమెరికా బలగాల చేత చిక్కిన వైనం
-2010లో సిద్ధిఖీకి 86 ఏళ్ల జైలు శిక్ష
-కోలీవిల్లేలో ఓ ప్రార్థనామందిరంలో సాయుధుడి చొరబాటు
-సాయుధుడ్ని కాల్చిచంపిన భద్రతా బలగాలు

అమెరికాలో ఆఫియా సిద్ధిఖీ అనే మహిళా ఉగ్రవాదిని గతంలో భద్రతా బలగాలు ఆఫ్ఘనిస్థాన్ లో అరెస్ట్ చేశాయి. పాకిస్థాన్ కు చెందిన ఆఫియా సిద్ధికీ ఓ న్యూరోసైంటిస్ట్. అయితే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడుల అనంతరం ఆమెను అల్ ఖైదా ఉగ్రవాదిగా అమెరికా నిర్ధారించింది. మరిన్ని దాడులకు సంబంధించిన కుట్రలకు పాల్పడుతోందంటూ ఆఫియా సిద్ధిఖీని అరెస్ట్ చేసి ఫోర్ట్ వర్త్ నగర జైల్లో ఉంచారు.

కాగా, ఆమె విడుదల కోసం ఓ దుండగుడు తాజాగా నలుగుర్ని బందీలుగా చేసుకున్నాడు. డల్లాస్ సమీపంలోని కోలీవిల్లే టౌన్ లో యూదుల ప్రార్థనా మందిరం సినగోగ్ లోకి ప్రవేశించిన సాయుధుడు అక్కడి మతగురువు సహా నలుగురిని బందీలుగా పట్టుకున్నాడు. ఆఫియా సిద్ధిఖీని విడుదల చేయాలని డిమాండ్ చేశాడు.

అయితే అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) దళాలు, కోలీవిల్లే పట్టణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అతడితో పలు దఫాలు చర్చలు కొనసాగించాయి. ఈ క్రమంలో ఒక బందీని విడిచిపెట్టాడు. ఆపై చర్చలు విఫలం కావడంతో అతడిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంతరం మిగతా వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చాయి.

ఆఫియా సిద్ధిఖీపై ఆరోపణలను అమెరికా కోర్టు 2010లో నిర్ధారించి 86 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఫోర్ట్ వర్త్ జైల్లో ఇటీవల జరిగిన ఘటనలో సిద్ధిఖీ తీవ్రగాయాలపాలైనట్టు తెలిసింది. తోటి ఖైదీ ఆమెపై దాడి చేసిందని, సిద్ధిఖీ ప్రస్తుతం సరిగా నడవడంలేదని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

సిద్ధిఖీకి అమెరికా కోర్టులో శిక్ష పడిన నేపథ్యంలో నాటి పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత కూడా పాకిస్థాన్ ప్రభుత్వ పెద్దలు అమెరికాతో సిద్ధిఖీ అంశం అడపాదడపా చర్చిస్తూనే ఉన్నారు.

Related posts

జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి!

Drukpadam

ఎమ్మెల్యేల ఎర కేసులో ఎంపీ కృష్ణం రాజుకు సిట్ నోటీసులు …

Drukpadam

ఆసుపత్రిలో కరోనా పేషెంట్ మృతి.. డాక్టర్లను చితకబాదిన బంధువులు!

Drukpadam

Leave a Comment