Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న్యూజిలాండ్ యూత్ పార్లమెంటు సభ్యురాలిగా తెలుగుమ్మాయి మేఘన!

న్యూజిలాండ్ యూత్ పార్లమెంటు సభ్యురాలిగా తెలుగుమ్మాయి మేఘన!

  • న్యూజిలాండ్ లో స్థిరపడిన మేఘన కుటుంబం
  • మేఘన తండ్రి పేరు గడ్డం రవికుమార్
  • రవికుమార్ స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు
  • సామాజిక సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్న మేఘన

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తెలుగువారు సత్తాచాటడం కొత్త కాదు. అనేక దేశాల ప్రభుత్వాల్లోనూ, అధికార వ్యవస్థల్లోనూ తెలుగువారు కీలక పదవులు చేపడుతున్నారు. తాజాగా, న్యూజిలాండ్ యూత్ పార్లమెంటు సభ్యురాలిగా తెలుగుమ్మాయి మేఘన ఎంపికైంది. యువతరం ప్రతినిధిగా టీనేజి వయసులోనే ఆమె చట్టసభలో ప్రవేశించింది. 18 ఏళ్ల మేఘన వాల్కటో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.

మేఘన తండ్రి గడ్డం రవికుమార్ స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు. రవికుమార్ 2001లో న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. మేఘన న్యూజిలాండ్ గడ్డపైనే పుట్టిపెరిగింది. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే మేఘన అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా శరణార్థులకు చేయూతనివ్వడంలో ఎంతో కృషి చేస్తోంది. ఈ అంశంలో ఆమె కనబర్చుతున్న సేవా దృక్పథమే యూత్ పార్లమెంటు సభ్యత్వం లభించేందుకు కారణమైంది. మేఘన వచ్చే నెలలో ప్రమాణస్వీకారం చేయనుంది.

Related posts

డోర్నకల్ లో వీఆర్ఏలకు(ప్రెస్ క్లబ్)జర్నలిస్టుల మద్దతు…

Drukpadam

ఖలిస్థాన్ ఉగ్రవాదుల విషయమై కేంద్రం కీలక ఆదేశాలు

Ram Narayana

సోనీ-జీ కంపెనీల మధ్య విలీన ఒప్పందం…

Drukpadam

Leave a Comment