జనరల్ వార్తలు ...

మరోసారి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా …సీఎల్పీ నేత భట్టికి కరోనా!

మరోసారి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా …సీఎల్పీ నేత భట్టికి కరోనా
-అంతకుముందు మంత్రులు ,జగదీష్ రెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి , ఎర్రబెల్లి ,లకు కరోనా
-రాజకీయ నేతలనూ వదలని కరోనా
-కొన్ని నెలల కిందటే కరోనా నుంచి కోలుకున్న పోచారం
-తాజాగా రెండోసారి కరోనా
-హైదరాబాదు ఏఐజీ ఆసుపత్రిలో చేరిక

కరోనా బారినపడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. దాంతో హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. సీఎల్పీ నేత భట్టికి సైతం కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో ఆయనతో గత వారం రెండుమూడు రోజులుగా ఉన్నవారినందరిని పరీక్షలు చేయంచుకోవాలని కోరారు . జగదీష్ రెడ్డి ,ఎర్రబెల్లి , ఇంద్రకరణ్ రెడ్డి లుకూడా కరోనా భారిన పడి కోలుకున్నారు . గతంలో మంత్రి పువ్వాడ అజయ్ కూడా కరోనా భారిన పడ్డారు .ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక మంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ,ఎంపీలకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయి కోలుకున్నారు . ఏపీ లో ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మూడవసారి కరోనా రావడం గమనార్హం ….

ప్రస్తుతం స్పీకర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. పోచారం శ్రీనివాసరెడ్డి కొన్నినెలల కిందటే కరోనా బారినపడ్డారు. అటు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయన ప్రస్తుతం హైద్రాబాద్ లోనే హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

 

Related posts

ఝార్ఖండ్ సీఎం నివాసంలో 15 మందికి కరోనా!

Drukpadam

Listen up: 3 Canadian fashion podcasts you should hear

Ram Narayana

క‌రోనా కొత్త వేరియంట్ విజృంభ‌ణ‌.. చైనాలో లాక్ డౌన్‌!

Drukpadam