Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణాలో వందలాది మందికి పోలీసులకు కరోనా !

తెలంగాణ పోలీసు శాఖపై కరోనా పంజా.. కరోనా బారిన పడ్డ వందలాది మంది పోలీసులు!

  • థర్డ్ వేవ్ లో దాదాపు 500 మంది పోలీసులకు కరోనా
  • అందరూ బూస్టర్ డోసులు తీసుకోవాలని ఆదేశించిన ఉన్నతాధికారులు
  • పీఎస్ కు ఫిర్యాదుదారుడు ఒక్కడే రావాలని ఆంక్షలు

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో పోలీసులపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పీఎస్ లో కేసులు నమోదవుతున్నాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పోలీసులు ఎంతో కష్టించి పని చేశారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులను నిర్వహించారు. అలాంటి పోలీసులు ఇప్పుడు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. కరోనా థర్డ్ వేవ్ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 500 మంది పోలీసులకు కరోనా సోకింది.

హైదరాబాదులోని మూడు కమిషనరేట్లలో పోలీసులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్లకు ఎక్కువ మంది రాకూడదని, కేవలం ఒక్కరు మాత్రమే రావాలని ఆంక్షలు విధించారు. హోమ్ గార్డ్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Related posts

ఏపీ అంబులెన్స్ లను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు…

Drukpadam

ఆక్సీజనరేటర్ల ఏర్పాటుతో ఆక్సిజన్ కొరత తీర్చొచ్చు: డాక్టర్ కేవీరావు…

Drukpadam

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ర్ఫ్యూను ఈ నెలాఖరువరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం…

Drukpadam

Leave a Comment