పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్!
17వ తేదీతో ముగిసిన సర్వే
ఎక్కువ మంది ఓటు మన్ కే
మొహాలిలో ప్రకటించిన కేజ్రీవాల్
ముందుగా ప్రకటించిన విధంగానే అప్ సీఎం అభ్యర్థిని ప్రజల ఆమోదం మేరకు ప్రకటిస్తామన్న అప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అప్ పంజాబ్ చీఫ్ గా ఉన్న భగవంత్ సింగ్ మాన్ కు కేజ్రీవాల్ పిలుపు మేరకు 22 లక్షలమంది ఓట్లు వేసి సీఎంగా మాన్ ఉండాలని కోరారు ప్రజల కోరికగా మేరకు భగవంత్ సింగ్ మాన్ తమ సీఎం అభ్యర్థి అని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు . ప్రస్తుతం సంగ్రూర్ ఎంపీగా భగవంత్ మన్ కొనసాగుతున్నారు . పంజాబ్ లో 3 కోట్లమంది జనాభా ఉండగా వారిలో 22 లక్షల మంది ఓటింగ్ పాల్గొన్నారు . పాల్గొన్న వారిలో 93 . 3 శాతం మంది భగవత్ సింగ్ మాన్ సీఎం అభ్యర్థిగా కావలనగా మరో 3 శాతం మంది పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు అప్ సీఎం అభ్యర్థిగా ఉండాలని కోరడం విశేషం .
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల చేత ఎన్నిక చేయబడిన వ్యక్తిని ప్రకటించడం దేశంలోనే మొదటిసారి కావడంతో ప్రజలు ఈ ప్రక్రియను ఆశక్తిగా గమనించారు. మొదటి నుంచి మాన్ నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని అప్ సైతం అనుకున్నదాని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున భగవంత్ మన్ ఎంపికయ్యారు. మెజారిటీ ప్రజల ఆమోదం మేరకు ఆయన పేరును ఆప్ ఖరారు చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ ఎంపిక ఎవరో తెలియజేయాలని కోరుతూ పంజాబ్ లో ఆప్ సర్వే నిర్వహించింది. ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మెస్సేజ్ లు, ఫోన్ కాల్స్ రూపంలో ప్రజల అభిప్రాయాలను 17వ తేదీ సాయంత్రం వరకు స్వీకరించింది.
పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్వే ఫలితాలను మొహాలి వేదికగా వెల్లడించారు. మన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. వచ్చే నెల 20న పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలు ఆప్ కు అధికారం కట్టబెడితే ముఖ్యమంత్రి పదవిని మన్ అలంకరించనున్నారు. ప్రస్తుతం సంగ్రూర్ ఎంపీగా మన్ ఉన్నారు.