Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

‘గాడిదా… సామాజిక కాదు, వ్యక్తిగత’… బాలయ్య చిరుకోపం..

గాడిదా… సామాజిక కాదు, వ్యక్తిగత’… బాలయ్య చిరుకోపం..
ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి
తండ్రికి ఘననివాళి అర్పించిన బాలయ్య
కరోనా వ్యాప్తి గురించి బాలయ్య వ్యాఖ్యలు
వ్యక్తిగత దూరం పాటించాలని పిలుపు
సామాజిక దూరమంటూ ఓ వ్యక్తి వ్యాఖ్యలు

బాలయ్య అదేనండి మన నందమూరి నందమూరి అందగాడు బాలకృష్ణ బోళాశంకరుడు …తన మనుసులో ఏది పెట్టుకోకుండా అభిప్రాయాలను స్వచగా వ్యక్తపరిచేవాడు . అందరు ఆప్యాయంగా బాలయ్య అని పిలుస్తారు . మంగళవారం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైద్రాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మాట్లాడుతూ వ్యక్తిగాదురం పాటించాలని అన్నారు .దానికి అక్కడ ఉన్నవారిలో ఒకరు వ్యక్తిగత కాదు సామజిక అనడంతో కోపంతో గాడిద …సామజిక కాదు వ్యక్తిగత అనడం అక్కడ ఉన్నవారిని నవ్వులు పూవించింది.

ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

నివాళులు అర్పించిన సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ప్రబలుతోందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించాలని పిలుపునిచ్చారు. అయితే, అక్కడున్నవారిలో ఒకరు వ్యక్తిగత కాదు సామాజిక అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తనదైన శైలిలో స్పందించిన బాలయ్య… “గాడిదా… సామాజిక కాదు, వ్యక్తిగత” అంటూ స్పష్టం చేశారు. దాంతో అక్కడున్నవారు నవ్వేశారు.

గతంలో ‘సామాజిక దూరం’ అనడం పట్ల విస్తృత స్థాయిలో చర్చ జరగడం తెలిసిందే. తర్వాతి క్రమంలో దాన్ని ‘భౌతికదూరం’ అని పిలుస్తున్నారు. బాలకృష్ణ దాన్నే ‘వ్యక్తిగత దూరం’ అని పలికారు.

Related posts

తెలంగాణలో 20 మంది ఐఏఎస్‌ల‌ బ‌దిలీ…ఖమ్మం కలెక్టర్ గా ముజమ్మిల్ ఖాన్ …

Ram Narayana

సాయిధరమ్ తేజ్ ప్రమాదం… మీడియా స్పందించినతీరు పై తీవ్ర అభ్యంతరాలు!

Drukpadam

గుజరాత్ లో మళ్లీ బీజేపీనే… ఎగ్జిట్ పోల్స్ ఇవిగో!

Drukpadam

Leave a Comment