Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

థాకరే వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఘాటు స్పందన…

థాకరే వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఘాటు స్పందన…
అప్పటికి మీ పార్టీ ఇంకా పుట్టలేదు.. మీ సభ్యుడు బీజేపీ టికెట్ పై పోటీ చేశాడు:
రాజకీయ అవసరాలకు బీజేపీ హిందుత్వను వాడుకుంటోందన్న థాకరే
ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పాతికేళ్లు వృథా చేసుకున్నామని వ్యాఖ్య
థాకరే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్న ఫడ్నవిస్

రాజకీయ అవసరాల కోసం బీజేపీ హిందుత్వాన్ని వాడుకుంటోందని మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పాతికేళ్ల సమాయాన్ని వృథా చేసుకున్నామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఘాటుగా ప్రతిస్పందించారు.

శివసేన కేవలం వారికి అవసరమైన విషయాలను మాత్రమే గుర్తుంచుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ముంబై పురపాలక సంస్థలో బీజేపీ సభ్యులు ఉన్న సమయంలో శివసేన అప్పటికి ఇంకా పుట్టలేదని అన్నారు. 1984 ఎన్నికల్లో శివసేన సభ్యుడు బీజేపీ టికెట్ పై పోటీ చేశారని తెలిపారు.

ఇటీవల జరిగిన నగర పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన నాలుగో స్థానానికి పరిమితమైందని… ఈ ఫలితాలతో థాకరే తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని, అందుకే ఏదో మాట్లాడుతున్నారని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. రామ జన్మభూమి పోరాటం జరుగుతున్న సమయంలో మీరెక్కడున్నారని ప్రశ్నించారు. తాము తూటాలను, లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నామని చెప్పారు. ఈరోజు ప్రధాని మోదీ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని అన్నారు.

Related posts

బీఆర్ఎస్ కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ!

Drukpadam

ప్రభుత్వ ఎస్సీ వ్యతిరేక చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారు: చంద్రబాబు…

Drukpadam

పవర్ గేమ్ ….ప్రధాని పర్యటనకు దూరంగా కేసీఆర్…

Drukpadam

Leave a Comment