Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రిపోర్ట‌ర్‌ను తిట్టిన బైడెన్.. త‌ర్వాత‌ సారీ!

రిపోర్ట‌ర్‌ను తిట్టిన బైడెన్..

  • శ్వేత‌సౌధంలో ఘ‌ట‌న‌
  • ద్ర‌వ్యోల్బ‌ణంపై రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌
  • కోప‌గించుకున్న బైడెన్‌
  • త‌ర్వాత‌ ఫోన్ చేసి సారీ చెప్పిన వైనం

ఓ జర్నలిస్టు‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. శ్వేత‌సౌధంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన బైడెన్‌ను ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పీటర్ డూసీ ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశారు. దీంతో బైడెన్ ఒక్క‌సారిగా నోరుజారి తిట్టారు. మీడియా స‌మావేశం ముగిసిన వెంట‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ఇత‌ర రిపోర్ట‌ర్లు ఈ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోలేదు.

మధ్యంతర ఎన్నికల వేళ ద్రవ్యోల్బణం అంశాన్ని రాజకీయ బాధ్యతగా భావిస్తారా? అని ఆ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బైడెన్ అస‌హ‌నానికి గురై ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అన్నారు. ‘వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ బి….’ అంటూ తిట్టారు. రిప‌బ్లిక‌న్ల‌కు ఫాక్స్ ఛానల్ అనుకూలంగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వ విధానాలను పీటర్ డూసీ ఎప్పుడూ తప్పుపడుతుంటారు. ఈ నేప‌థ్యంలోనే బైడెన్ ఆ రిపోర్టర్‌పై మండిప‌డ్డారు. అయితే, ఈ ఘ‌ట‌న జ‌రిగిన అనంత‌రం ఆ రిపోర్ట‌ర్‌కు బైడెన్‌ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది.

Related posts

బాక్సింగ్ లో భారత్​ కు కాంస్య పతకం సాధించిన లవ్లీనా..అభినందనల వర్షం!

Drukpadam

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి గుండెపోటు.. చెన్నై అపోలోకు తరలింపు!

Drukpadam

వీధి కుక్కలను పట్టుకునేందుకు నేపాల్ నుంచి ప్రత్యేక బృందాలు!

Drukpadam

Leave a Comment