Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పాఠశాలల్లో ప్రార్ధనలు రద్దు …తెలంగాణాలో బడులు తెరిచే యోచన!

కరోనా అంత సీరియస్‌గా ఏమీ లేదు.. బడులు తెరిచేద్దాం: తెలంగాణ సర్కారు యోచన!
కేసులు పెరుగుతున్నా తీవ్రత తగ్గుముఖం
పునరాలోచనలో ప్రభుత్వం
ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రత్యక్ష తరగతులు
పిల్లల్ని పంపాలా? వద్దా? అనేది తల్లిదండ్రుల ఇష్టానికే..

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవులకు ముందుగానే తెలంగాణ ప్రభుత్వం బడులకు సెలవులు ప్రకటించింది. అవి ముగిశాక కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగించింది. అయితే, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మునుపటిలా అంత తీవ్రమైన పరిస్థితులు లేకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. బడులు తెరవాలని యోచిస్తోంది.

కరోనా వ్యాప్తి త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ తర్వాత సెలవులు ముగియనుండడంతో వీలైతే ఆ తర్వాతి రోజు నుంచే బడులు తెరవాలని యోచిస్తోంది. కుదరకుంటే సెలవులు మరో వారం పొడిగించి ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రత్యక్ష తరగతులు కొనసాగించాలని భావిస్తోంది. అయితే, కరోనా భయాల నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపాలా? వద్దా? అనే విషయాన్ని మాత్రం తల్లిదండ్రులకే వదిలేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీ పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలు రద్దు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
పాఠశాలల్లో క్రీడలు నిర్వహించకూడదు
పాఠశాల గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇకపై ఉదయం పూట ప్రార్థనలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో క్రీడలు నిర్వహించవద్దని తెలిపింది. విద్యార్థులు ఒకే చోట గుమికూడకుండా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని సూచించింది. పాఠశాల గదులను, ఆవరణను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశించింది.

జిల్లా విద్యాధికారులు జిల్లా వైద్యాధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని… విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ కరోనా బారిన పడితే వెంటనే చికిత్స అందించేలా చూడాలని తెలిపింది. మాస్కులు ధరిస్తూ, భౌతికదూరాన్ని పాటించాలని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

 

Related posts

నిరుద్యోగులకు కేసీఆర్ తీపి కబురు … 50 వేల ఉద్యోగాల నియామకాలు!

Drukpadam

ఖమ్మంలో ఈడీ, ఐటీ దాడుల కలకలం …పరేషాన్ లో ప్రవేట్ ఆసుపత్రులు!

Drukpadam

‘రయ్’ మంటూ దూసుకుపోవద్దు!.. హైదరాబాద్ లో కొత్త వేగ పరిమితులు!

Drukpadam

Leave a Comment