Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ లో 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు…

ఏపీ లో 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు…
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా
అరకు పార్లమెంట్ పెద్దగా. ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉన్నందున 2 జిల్లాలు
ఇక డ్రాఫ్ట్ ఉత్తర్వులు తరువాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న 13 జిల్లాలకు బదులు 26 జిల్లాలు కానున్నాయి. వైకాపా అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంట్ నియోజవర్గాన్ని ఒక జిల్లా చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రకటించడమే గాక , ఎన్నికల ప్రణాళికలో సైతం పెట్టారు . దీంతో ఇప్పడు అది కార్యరూపం దాల్చబోతుంది. ఏపీ లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గం ఒక జిల్లా అవుతుంది. అయితే ఆరుకు పార్లమెంట్ పూర్తీ ఏజన్సీ తో పాటు భౌగోళికంగా పెద్దగా ఉంటుంది. దీంతో దాన్ని రెండు జిల్లాలు చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే . మూడు డ్రాఫ్ట్ ప్రతిని విడుదల చేసి ప్రజల నుంచి అభ్యన్తరాలు స్వీకరించిన అనంతరం ఫైనల్ గా జిల్లాల విభజన జరిగి పరిపాలన విభజన ప్రకారం అందుబాటులో వస్తుంది. అయితే జిల్లాల పేర్లపై అనేక ఆలోచనలు ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తుల ఆధారంగా చేస్తారని తెలుస్తుంది. కృష్ణా జిల్లాను విజయవాడ , మచిలీపట్టణం గా చేయనున్నారు .అయితే ఎన్నికలకు ముందే సీఎం జగన్ మచిలీపట్టణం ను ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయనున్నారు. రాజాం పేట జిల్లగాను మిగతా జిల్లాల పేర్లు కూడా ప్రముఖుల , చారిత్రిక ప్రాముఖ్యత గల పేర్లు పెట్టాలనే డిమాండ్స్ వస్తున్నాయి. జిల్లాలకు సంబందించిన ప్రతిపాదన ను అధికారులు మంగళవారం సీఎస్ కు అందజేశారు.

రాజంపేటను ‘అన్నమయ్య జిల్లా’గా చేయండి… సీఎంకు లేఖ రాసిన ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన
అన్నమయ్య జన్మస్థలం రాజంపేటలోనే ఉందన్న మేడా
రాజంపేటలో విలువైన సంపద ఉందని వెల్లడి

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండడం తెలిసిందే. పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాల ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సీఎం జగన్ కు లేఖ రాశారు. రాజంపేటను జిల్లాగా చేయాలని మల్లికార్జునరెడ్డి కోరారు. రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జన్మస్థలం రాజంపేటలోనే ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాజంపేటలో విలువైన సంపద ఎక్కువగా ఉందని తెలిపారు.

Related posts

ఒసామా బిన్ లాడెన్ తరహాలో ఐసిస్ కీలక నేత అబు ఇబ్రహీం అల్ హషీమీ హతం!

Drukpadam

తిరుమ‌ల‌లో డిక్ల‌రేష‌న్ ఇచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణం ఇదే!

Ram Narayana

‘ఛలో విజయవాడ’ దద్దరిల్లింది …నిర్బంధాలను సైతం లెక్క చేయని ఉద్యోగులు!

Drukpadam

Leave a Comment