Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గవర్నర్ ప్రసంగంలో పసలేదు-సీఎల్పీ నేత భట్టి

గన్ పార్కువద్ద మీడియాతో మాట్లాడుతున్న సీఎల్పీ నేత భట్టి

గవర్నర్‌ తమిళిసై ప్రసంగంలో పసలేదు.భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై ప్రసంగంలో పసలేదు, స్పష్టత లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్నర్‌ ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గన్‌పార్క్‌ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అరేళ్లుగా చెప్పిందే చెప్తున్నారని, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 57 ఏళ్లు దాడినవారికి పెన్షన్లు ఇస్తామని చెప్పారని, కొత్త రేషన్‌ కార్డు ఇవ్వలేదన్నారు. క్రాంగ్రెస్‌ హయాంలో బియ్యంతో పాటు 9 రకాల సరుకలు ఇచ్చేశాళ్లం అన్నారు. నిరుద్యోగ భృతికి విధి విధానాలు రూపొందించలేదని, లక్షా 39 వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. మిషన్ భగీరథ నీరు ఎవరికి ఇస్తున్నారని, మునుగోడు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో నీరు రావట్లేదన్నారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భగీరథ నీటిపై విసిరిన సవాల్‌ను స్వీకరించిన, కల్వకుర్తి లిఫ్ట్‌‌ ఇరిగేషన్, నాగార్జున సాగర్ నుంచి రావాల్సిన నీరు రావట్లేదన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని అడ్వకేట్ దంపతుల హత్య పట్టపగలే జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాలు నవ్వులాటగా మారాయని, బడ్జెట్‌పై చర్చ కేవలం ఆరు రోజులే నిర్వహించటం దారుణమన్నారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేదని భట్టి ప్రశ్నించారు.

Related posts

అయోధ్యలో 15 లక్షల ప్రమిదలను వెలిగించి గిన్నిస్ రికార్డు!

Drukpadam

ఇమ్రాన్‌కు షాక్.. అవిశ్వాస తీర్మానంలో ఓటమి..

Drukpadam

ఇది రైతు ప్రభుత్వం …దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10 వేలు ఇస్తాం:కేసీఆర్ 

Drukpadam

Leave a Comment